ప్రముఖ డ్యాన్సర్, ఢీ విన్నర్ జాను (Janulyri) తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎమోషనల్ వీడియోలు షేర్ చేస్తూ తీవ్ర ఆవేదన (Janulyri Emotional ) వ్యక్తం చేసింది. తనపై జరుగుతున్న ట్రోలింగ్, వ్యక్తిగత దాడులు, బూతు కామెంట్స్ కారణంగా ఇక తనకు జీవించాలన్న ఆసక్తి లేదని, బతకలేను అంటూ కన్నీటి పర్యంతమైంది. “నాకు ఓపిక నశించింది.. ఈ నరకం భరించలేకపోతున్నాను.. నా చావుకి కారణం మీరే అవుతారు” అంటూ ఆమె వేదనను వీడియోల రూపంలో వెల్లడించింది.
జాను తన వీడియోల్లో ఆమె వ్యక్తిగత జీవితంపై వస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తన ఆచరణ, హావభావాలు, కుటుంబ సభ్యులతో జరిపే సంభాషణలకూ తప్పుడు అర్థాలివ్వడం, వాటిపై అనుచితమైన కామెంట్లు పెట్టడం తన మనసు గాయపరిచిందని చెప్పింది. “నన్ను తప్పుడు కోణంలో చూపించడం ద్వారా మీరు నా జీవితం అంతా నాశనం చేస్తున్నారు. నా పర్సనల్ లైఫ్‌ని టార్గెట్ చేసి మీకు వ్యూస్ వస్తాయేమో కానీ, నా బతుకంతా నరకంగా మారుతోంది” అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
తాను 8 ఏళ్లుగా తన కొడుకును ఒంటరిగా పెంచుకుంటున్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఆమె జీవితంలో ఉన్న మంచి అంశాలను మరిచి, తప్పుడు ప్రచారాలతో తనను దూషించడం అన్యాయం అని పేర్కొంది. “ఒక అమ్మాయి జీవితాన్ని ఇలా రోడ్డున పడేస్తారా? అని ప్రశ్నించింది. ఈ వీడియోల ద్వారా జాను వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి ఎంత తీవ్రమైందో తెలుస్తోంది. తక్షణమే ఈ పరిస్థితిని అందరూ సీరియస్‌గా పరిగణించి, సోషల్ మీడియా ట్రోలింగ్ ఆపాలని కోరుతున్నారు.