Site icon HashtagU Telugu

Jani Master : వరదల్లో జానీ మాస్టర్.. నడుములోతు నీళ్ళల్లో బాధితుల్ని పరామర్శిస్తూ.. 500 మందికి సాయం..

Jani Master Visited Vijayawada Flood Areas and Helped to 500 People

Jani Master

Jani Master : విజయవాడలో(Vijayawada) ఇటీవల వచ్చిన వర్షాలకు ఏర్పడిన వరదలకు(Floods) సింగ్ నగర్ చుట్టూ పక్క ప్రాంతాలు మునిగిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరంగా చేస్తుంది. మరో పక్క అనేకమంది సెలబ్రిటీలు తమ వంతు విరాళాలు రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కి అందచేస్తున్నరు. పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, పలు NGO సంస్థలు స్వయంగా వరద ప్రాంతాల్లోకి వచ్చి బాధితుల్ని పరామర్శించి వారికి సహాయం చేస్తున్నారు.

ఈ క్రమంలో స్టార్ డ్యాన్స్ మాస్టర్, జనసేన నేత జానీ మాస్టర్ విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సందర్శించారు. నడుములోతు నీళ్ళల్లో దిగి నడుచుకుంటూ వెళ్లి అక్కడి ఇళ్ళని పరిశీలించారు. పలువురు బాధితుల్ని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు.

జానీ మాస్టర్ సొంతంగా తన డబ్బుతో 500 మందికి ఒక్కొక్కరికి 500 విలువ చేసే నిత్యవసర వస్తువులను పంపిణి చేసారు. దీంతో జానీ మాస్టర్ ని జనసైనికులు, నెటిజన్లు అభినందిస్తున్నారు. జానీ మాస్టర్ వరద బాధితుల్ని పరామర్శించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

Also Read : Budameru : బుడమేరు గండి పూడిక పనులను పరిశీలించిన పురందేశ్వరి