Site icon HashtagU Telugu

Janhvi Kapoor: శ్రీవారి సేవలో జాన్వీ కపూర్.. పరికిణిలో మెరిసిన బాలీవుడ్ అందం

2

2

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ వేంకటేశ్వర దేవాలయం భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన దేవాలయాలలో ఒకటి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతిఒక్కరూ శ్రీవారిని దర్శించుకోవడానికి ఇష్టం చూపతుంటారు. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని దర్శించుకుంది. ఎప్పుడూ టు పీస్ దుస్తులో మెరిసిపోయే జాన్వీ సంప్రదాయ దుస్తుల్లో ఈ ఆలయానికి వెళ్లింది. మేకప్ లేని లుక్, సాంప్రదాయ దుస్తులు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. జాన్వీ తన బృందంతో కలిసి ఇవాళ తిరుపతి బాలాజీని దర్శించుకుంది. జాన్వీ మాత్రమే కాదు ఆమె తల్లి కూడా తిరుమలను దర్శించుకునేది. అదే ఆనవాయితీని జాన్వీ కొనసాగిస్తోంది.

జాన్వీ కపూర్ శ్రీ వేంకటేశ్వర ఆలయానికి వచ్చిందని తెలిసిన వెంటనే అభిమానులు, ప్రియతమ నటిని చూసేందుకు ఆలయ ప్రాంగణానికి పెద్దఎత్తున తరలివచ్చారు. అయితే అభిమానులతో మాట్లాడేందుకు నటి నిరాకరించింది. జాన్వీ కపూర్ బాలాజీ టెంపుల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జాన్వీ తన రాబోయే సినిమా కోసం ఆశీర్వాదం కోసం శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించినట్లు సమాచారం. జాన్వీ చివరిసారిగా నితేష్ తివారీ బవాల్‌లో కనిపించింది. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం ఎన్టీఆర్ పక్కన ‘దేవర’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ద్వారా దక్షిణాది ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది.

Also Read: MLC Kavitha: కాంగ్రెస్‌ ప్రకటించింది దళిత డిక్లరేషన్‌ కాదు ఫాల్స్‌ డిక్లరేషన్‌: ఎమ్మెల్సీ కవిత