Site icon HashtagU Telugu

NTR 30 Big Update: జాన్వీ కపూర్ ‘బర్త్ డే’ సర్ ప్రైజ్.. NTR 30లో హీరోయిన్ గా ఫిక్స్!

Ntr 30

Ntr 30

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ 30 మూవీ కోసం కొరటాల శివతో కలిసి పనిచేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించినప్పటి నుండి అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన మూవీ సూపర్ హిట్ కావడమే అందుకు కారణం. ఈ నెలాఖరులో ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభమవుతుందని, ఆ తర్వాత వెంటనే సెట్స్‌పైకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. కొరటాల శివ ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు.

అయితే ఇవాళ మేకర్స్ క్రేజీ అప్‌డేట్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచారు. జాన్వీ కపూర్ (Janhvi Kapoor)  ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు, ఆమెకు (Janhvi Kapoor)  పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అద్భుతమైన పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ బ్యూటీ ఎన్టీఆర్ లెజెండ్ అని, ఆయనతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంటుందని (Janhvi Kapoor) చెప్పింది. ఉత్కంఠ రేపుతున్న ఈ కాంబినేషన్ ఇప్పుడు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.

ఎన్టీఆర్ 30 కేవలం యాక్షన్‌ (Action)పై మాత్రమే కాకుండా బలమైన భావోద్వేగాలను కూడా ఉంటాయి. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 5, 2024న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీని, ప్రొడక్షన్ డిజైన్‌ను సాబు సిరిల్ హ్యాండిల్ చేస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పిస్తున్నారు.

Also Read: Khushboo Sundar: 8 ఏళ్ల వయసులోనే నా తండ్రి వేధించాడు: ఖుష్బూ సుందర్