Janhvi and Jr NTR: ఎన్టీఆర్ ఓ లెజెండ్, ఆయనతో కలిసి నటిస్తా.. జాన్వీ కామెంట్స్

జూనియర్ ఎన్టీఆర్ ఒక లెజెండ్ అని నటి జాన్వీ కపూర్ అన్నారు. ఈ శుక్రవారం థియేటర్లలోకి తన బాలీవుడ్ చిత్రం మిలీ విడుదల కాబోతోంది.

Published By: HashtagU Telugu Desk
Janhvy And Jrntr

Janhvy And Jrntr

జూనియర్ ఎన్టీఆర్ ఒక లెజెండ్ అని నటి జాన్వీ కపూర్ అన్నారు. ఈ శుక్రవారం థియేటర్లలోకి తన బాలీవుడ్ చిత్రం మిలీ విడుదల కాబోతోంది. అయితే ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ హైదరాబాద్ కు వచ్చింది. ఎన్టీఆర్‌తో కలిసి నటించడానికి అంగీకరిస్తారా అని అడిగిన ప్రశ్నకు.. ‘అలాంటి అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు’ అని బదులిచ్చారు.

‘‘ఎన్టీఆర్ నటన నాకు ఇష్టమని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. అతను ఒక లెజెండ్. ఆయనతో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను” అని చెప్పింది. అయితే ఇంతకుముందు తెలుగు చిత్రాలను ఎందుకు తిరస్కరించారనే ప్రశ్నకు జాన్వీ కపూర్ స్పందించడానికి నిరాకరించింది. మరి ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్‌ని ఏ చిత్ర నిర్మాత ఎంపిక చేస్తారో చూడాలి.

  Last Updated: 03 Nov 2022, 03:21 PM IST