Site icon HashtagU Telugu

Janhvi Kapoor-Pushpa 2 : అల్లు అర్జున్ కు సపోర్ట్ గా జాన్వీ కపూర్

Jhanvi Pushpa 2

Jhanvi Pushpa 2

దేశ వ్యాప్తంగా పుష్ప 2 కు బ్రహ్మ రథం పడుతూనే..మరోపక్క ట్రోల్స్ చేస్తూ మరింతగా వార్తల్లో నిలిచేలా చేస్తున్నారు. ముఖ్యంగా నార్త్ లో ఈ మూవీ పై వస్తున్న ట్రోల్స్ పై నటి జాన్వీ కపూర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్లు అర్జున్(Allu Arjun) ప్రధాన పాత్రలో నటించిన ‘పుష్ప-2’ (Pushpa 2)సినిమా భారత సినిమా చరిత్రలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. సుకుమార్(Sukumar) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు ముందే పలు రికార్డ్స్ సాధించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 05 న విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ మంచి హైప్‌ను సృష్టించింది. అల్లు అర్జున్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, సుకుమార్ డైరెక్షన్, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సినిమాలోని ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులను అలరించేలా ఉండడం.. ప్రధానంగా అల్లు అర్జున్ పాత్రకు సంబంధించిన యాక్షన్ సీన్లు, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ముగ్ధులను చేస్తున్నాయి. రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ వంటి నటుల ఆకట్టుకునే పాత్రలతో పాటు చక్కని సినిమాటోగ్రఫీ కూడా ‘పుష్ప-2’కి ప్లస్ పాయింట్‌గా మారాయి. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది.

ఇదే క్రమంలో ‘పుష్ప 2’ సినిమాకు నార్త్​లో ఎక్కువ థియేటర్‌లు కేటాయించడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా లో ట్రోల్స్ , కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా కారణంగా హాలీవుడ్‌ హిట్ మూవీ ‘ఇంటర్‌స్టెల్లార్‌’ రీ రిలీజ్‌ వాయిదా పడిందంటూ నెట్టింట విమర్శిస్తూ పలు పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే ఈ అంశంపై తాజాగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) స్పందించారు. “పుష్ప 2 కూడా ఒక సినిమానే కదా. ఎందుకు దాన్ని మరొక మూవీతో పోలుస్తూ తక్కువ చేస్తున్నారు. మీరు ఏదైతే హాలీవుడ్‌ సినిమాను సపోర్ట్‌ చేస్తున్నారో వారే మన సినిమాలపై ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ మనం మాత్రం మన చిత్రాలను ఇంకా తక్కువ చేసుకుంటూ మనల్ని మనమే అవమానించుకుంటూ ఉండిపోతున్నాం. ఇటువంటివి చూసినప్పుడు బాధగా ఉంటుంది” అని జాన్వీ అసహనం వ్యక్తం చేశారు.

అలాగే నటి అనసూయ (Anasuya) సైతం పుష్ప 2 పై వస్తున్న ట్రోల్స్ పై రియాక్ట్ అయ్యింది. ‘నా అభిప్రాయం ప్రకారం… సీక్వెల్ అంటే ఒక కథకు కొనసాగింపు అని కదా అర్థం. మరి ఆ పార్ట్ తో ఈ పార్ట్ ని పోల్చడం ఎంత వరకు సబబు అంటాను. ఒక ఫ్లోలో కదా చూడాల్సింది తర్వాత ఏం జరిగిందని’ అని ట్వీట్ చేసింది. ట్రోల్స్ ఎలా ఉన్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం పుష్ప 2 సందడి మాములుగా లేదు. మొదటి రోజే దాదాపు రూ.300 కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్స్ సాధించింది.

Read Also : International Civil Aviation Day : నేడు అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం.. చరిత్ర, ప్రాముఖ్యతను తెలుసుకోండి..!