శ్రీదేవి(Sridevi) కూతురిగా జాన్వీ కపూర్(Janhvi Kapoor) బాలీవుడ్(Bollywood) లోకి ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ ఆరంభం నుంచి కంటెంట్ సినిమాలు చేసుకుంటూ వచ్చిన జాన్వీ ఇప్పుడిప్పుడే కమర్షియల్ సినిమాలు చేయడం మొదలు పెట్టింది. తాజాగా వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా నటించిన బవాల్(Bawaal) సినిమా జులై 21న రిలీజ్ కానుంది. డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి ఈ సినిమా రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.
ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రెస్ మీట్ లో శ్రీదేవి గురించి అడగడంతో శ్రీదేవి మరణం తర్వాత తన పరిస్థితుల గురించి చెప్తూ ఎమోషనల్ అయింది జాన్వీ. జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. అమ్మ దూరమైన రోజులు నాకింకా గుర్తు. ఆమె మరణాన్ని నేను జీర్ణించుకోలేకపోయా. అప్పుడు నా మొదటి సినిమా దఢక్ కోసం పని చేస్తున్నాను. అమ్మ మరణం తర్వాత కొన్నాళ్ళు గ్యాప్ తీసుకొని షూట్ లో చేరినా కూడా సరిగ్గా పనిచేయలేకపోయాను. నా లైఫ్ ముందుకు సాగడం చాలా కష్టంగా అనిపించింది. ఆ పరిస్థితులని, బాధని దాటి బయటకి రావడానికి పెద్ద యుద్ధమే చేశాను అంటూ ఎమోషనల్ అయింది.
దీంతో చాలా రోజుల తర్వాత మళ్ళీ శ్రీదేవి గురించి మాట్లాడటంతో జాన్వీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇక త్వరలో జాన్వీ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో తెలుగులో కూడా ఎంట్రీ ఇవ్వనుంది.
Also Read : Ram Charan’s Daughter: క్లీంకార కోసం స్పెషల్ రూమ్, వీడియో షేర్ చేసిన ఉపాసన