Kushi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఆల్రెడీ హీరోయిన్ గా దూసుకుపోతుంది. బాలీవుడ్, టాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. పెళ్లి చేసుకొని తిరుపతిలో సెటిల్ అవ్వాలని, ముగ్గురు పిల్లల్ని కనాలని, రోజూ అరిటాకులో తినాలని, రోజూ గోవిందా నామాలు వినాలని తన కోరికలు చెప్పుకొచ్చింది. శ్రీదేవి వల్ల జాన్వీకి తిరుపతి అంటే అమితమైన ప్రేమ ఏర్పడింది.
తాజాగా జాన్వీ చెల్లి ఖుషి కపూర్ కూడా తన పెళ్లి గురించి మాట్లాడింది. బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఖుషి కపూర్ మాట్లాడుతూ.. నాకు కూడా పెళ్లి గ్రాండ్ గా చేసుకోవాలని ఉంది. చిన్నప్పటి నుంచే పెళ్లిపై గౌరవం ఉంది. మా అక్క చెప్పినట్టే నాకు కూడా తిరుపతిలోనే పెళ్లి చేసుకోవాలని ఉంది. నేను ముంబైకి చెందిన అమ్మాయిని అయినా తిరుపతి అంటే ఇష్టం. మా పెళ్లి తర్వాత కూడా మా నాన్న బోనికపూర్ ని మాతోనే ఉండాలని అనుకుంటున్నాను. నా భర్త, ఇద్దరు పిల్లలు, పెంపుడు కుక్కలతో కలిసి ఉండాలి అని చెప్పింది.
దీంతో అక్క చెల్లెల్లు ఇద్దరికీ పెళ్లి మీద బాగానే కలలు ఉన్నాయి అని అనుకుంటున్నారు. మరి ఈ భామలు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో చూడాలి. ఇక ఖుషి కపూర్ ది ఆర్చీస్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. త్వరలో లవ్ యాపా అనే సినిమాతో రాబోతుంది. జాన్వీ లాగే ఖుషి తెలుగులోకి ఎంట్రీ ఎప్పుడిస్తుందో చూడాలి.
Also Read : Lucifer 2 Teaser : లూసిఫర్ 2 టీజర్ చూశారా? ఈసారి మరింత భారీగా.. మోహన్ లాల్ స్టైలిష్ ఫిలిం..