Janhvi Kapoor : ‘లైఫ్ పార్ట్ నర్’ గురించి జాన్వీ ఏంచెప్పిందంటే..!

బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో జాన్వీ కపూర్ ఒకరు. ఆమె చేతిలో కేవలం నాలుగు సినిమాలు ఉన్నప్పటికీ,

Published By: HashtagU Telugu Desk
Janhavy

Janhavy

బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో జాన్వీ కపూర్ ఒకరు. ఆమె చేతిలో కేవలం నాలుగు సినిమాలు ఉన్నప్పటికీ, నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. జాన్వీకి ఉన్న క్రేజ్ బాలీవుడ్ లో మరే హీరోయిన్ కు లేదని చెప్పక తప్పదు. ” ది కార్గిల్ గర్ల్, “ఘోస్ట్ స్టోరీస్” లాంటి చిత్రాలలో పాత్రలతో ఆకట్టుకుంది. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు తనకు నచ్చినవిధంగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది ఈ బ్యూటీ. సినిమాలతో పాటు ఇష్టమైన ప్రదేశాలను చుట్టేయడం, నచ్చిన పుస్తకాలను చదవడం, అప్పుడప్పుడు డాన్స్ చేయడం లాంటివి చేస్తుంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జాన్వీ తనకు కాబోయేవాడు (పెళ్లికొడుకు) ఎలా ఉండాలో చెప్పింది.  “అతను చాలా తెలివైనవాడై ఉండాలి. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండాలి. నన్ను ఎప్పటికప్పుడు సంతోష పెడుతూ ఉండాలి. జోవియల్ గా ఉండటం కూడా ముఖ్యం. అఫ్ కోర్స్, అతనికి నా మీద పిచ్చి ఉండాలి కదా!’’ అంటూ తన మనసులోని మాటలను బయటపెట్టింది.

“గుడ్ లక్ జెర్రీ”తో పాటు, జాన్వీ ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో పాటు తన రాబోయే చిత్రం “బవాల్” చిత్రీకరణలో ఉంది. నితీష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. వరుణ్, జాన్వి మొదటిసారిగా ఒక సినిమాలో కలిసి పని చేశారు. జాన్వీ మలయాళ చిత్రం “హెలెన్”కి రీమేక్ అయిన “మిలి” చిత్రంలో సన్నీ కౌశల్‌తో కలిసి కనిపించనుంది. “మిలీ” అనే మూవీ తన తండ్రి బోనీ కపూర్‌తో కలిసి ప్రోడ్యూస్ చేస్తోంది జాన్వీ.

  Last Updated: 25 Jun 2022, 10:15 AM IST