పుష్ప 2 తో మరోసారి పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకున్న అల్లు అర్జున్ (Allu Arjun)..ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో పాటు తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాల పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్ డైరెక్షన్లో జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి , అల వైకుంఠపురం సినిమాలు చేసి హ్యాట్రిక్ విజయాలు అందుకున్నాడు.
Ranveer Allahbadia : ఇదంతా అసభ్యత కాకపోతే ఇంకేంటి..?: యూట్యూబర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
దీంతో నాల్గోసారి వీరి కాంబో లో సినిమా అనగానే అంచనాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు అయ్యాయి. ఇదిలా ఉండగానే అట్లీ మూవీ కి సంబదించిన ఓ వార్త బయటకు వచ్చి ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది. రీసెంట్ గా జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన దేవర మూవీ లో నటించింది. ఈ మూవీ లో అమ్మడి గ్లామర్ కు యూత్ ఫిదా అయ్యారు. నిర్మాతలు కళ్లు కూడా జాన్వీ మీద పడ్డాయి. దీంతో వరుస ఛాన్సులు అమ్మడి తలుపు తడుతున్నాయి. ఇప్పటికే చరణ్ RC16 జాన్వీ నటిస్తుంది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ సరసన ఛాన్స్ అనగానే అమ్మడి జాతకం మారిపోవడం ఖాయమని ఆమె అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.