Janhvi Kapoor On NTR: ఎన్టీఆర్ తో బాగా ఎంజాయ్ చేశానంటున్న జాన్వీ

ఎన్టీఆర్ నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ దేవర. ఈ మూవీకి కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరూ కలిసి జనతా గ్యారేజ్ మూవీ చేశారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో మళ్లీ కలిసి సినిమా చేయాలి అనుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Janhvi Kapoor On NTR

Janhvi Kapoor On NTR

Janhvi Kapoor On NTR: ఎన్టీఆర్ నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ దేవర. ఈ మూవీకి కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరూ కలిసి జనతా గ్యారేజ్ మూవీ చేశారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో మళ్లీ కలిసి సినిమా చేయాలి అనుకున్నారు. అది ఇప్పటికి కుదిరింది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి దేవర సినిమా చేస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కు జంటగా అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది. జాన్వీని తెలుగు తెరకు పరిచయం చేయాలని చాలా మంది ప్రయత్నించారు కానీ.. కుదరలేదు. ఆఖరకు దేవరతో జాన్వీ తెలుగు తెరకు పరిచయం అవుతోంది.

ఇటీవల జాన్వీ కపూర్ ఇంటర్వ్య ఇచ్చింది. ఈ ఇంటర్వ్యలో పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. దేవర సినిమా జ్ఞాపకాలను కూడా పంచుకుంది. అయితే.. ఎన్టీఆర్ తో కలిసి దేవర సినిమాలో నటిస్తున్నారు కదా.. షూటింగ్ విశేషాలు, జ్ఞాపకాలు చెప్పమని అడిగితే.. డైలాగ్స్, డ్యాన్స్, ఫన్ వాట్ నాట్ అన్నీ జరిగాయని చెప్పారు. ఎన్టీఆర్ సెట్ లో చాలా సరదాగా ఉంటారు. అల్లరే అల్లరి.. తన రియల్ క్యారెక్టర్ కూడా అదే కావడంతో బాగా ఎంజాయ్ చేశానని జాన్వీ చెప్పారు.

అలాగే తల్లి శ్రీదేవి గురించి చెబుతూ.. తను అల్లరి చేసినప్పుడు.. అమ్మ రూమ్ కి వెళ్లి తెలియకుండా లిప్ స్టిక్స్ తీసుకున్నప్పుడు.. అమ్మ సరదాగా.. నా కొడకా.. అనేదని చెప్పింది. ఇలా పలు ఆసక్తికర విషయాలను ఈ ఇంటర్ వ్యూలో బయటపెట్టింది. జాన్వీ ఎన్టీఆర్ గురించి చెప్పిన సంగతులు, శ్రీదేవి గురించి చెప్పిన నా కొడకా.. డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మొత్తానికి ఎప్పటి నుంచో జాన్వీ తెలుగు ఎంట్రీ కోసం వెయట్ చేస్తున్న ఫ్యాన్స్ కు దేవర పండగే అని చెప్పచ్చు. మరి.. దేవరతో జాన్వీ కపూర్ టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అవుతుందేమో చూడాలి.

Also Read: Manchu Manoj: మనోజ్ ప్లాన్ మాములుగా లేదుగా… భారీ మల్టీస్టారర్

  Last Updated: 07 Jan 2024, 06:21 PM IST