Janhvi Kapoor : నాకు నచ్చినోడిని మనువాడే స్వేచ్చ ఉంది…!!

దివంగత నటి శ్రీదేవి కుమార్తె....బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Published By: HashtagU Telugu Desk
Jahnvi

Jahnvi

దివంగత నటి శ్రీదేవి కుమార్తె….బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అమ్మ శ్రీదేవి, నాన్న బోనీ కపూర్ కు డేటింగ్ ఇంట్రెస్ట్ ఉండదని…తనకు నచ్చినవాడిని పెళ్లి చేసుకోవాలన్నది వారి అభిమతమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం డేటింగ్ లేకుండా సింగిల్ గా సినిమాలపై ఫోకస్ పెట్టింది జాన్వీ కపూర్. ఈ క్రమంలోనే వరుస సినిమాలతో బిజీగా మారింది.

డేటింగ్ విషయంలో తన తల్లిదండ్రులది భిన్నమైన అభిప్రాయమని చెపింది జాన్వీ. డేటింగ్ అనేది ఓ సందర్భం. ఎందుకో తెలియదు, మమ్మీ, డాడీ ఈ విషయంలో ఇష్టంగా ఉండరు. నీవు ఎవరైనా అబ్బాయిని ఇష్టపడిత మా దగ్గరకు తీసుకురా పెళ్లి చేస్తాం అనేవారు. నచ్చిన ప్రతీ వ్యక్తిని పెళ్లి చేసుకోలేము కదా. మనకు కొంచెం చిల్ ఉండాలని జాన్వీ కపూర్ తెలిపింది. జాన్వీ గతంలో శిఖర్ పహారియాతో డేటింట్ నడిపిన విషయం తేలిసిందే. ఈ విషయాన్ని కాఫీ విత్ కరణ్ షోలో కరణ్ కూడా బయటపెట్టారు.

  Last Updated: 18 Aug 2022, 11:45 AM IST