Janhvi with Ram Charan: రామ్ చరణ్ తో జాన్వీ రొమాన్స్.. మరో ఛాన్స్ కొట్టేసిన బాలీవుడ్ బ్యూటీ!

చెర్రీ - బుచ్చిబాబు కాంబినేషన్‌లో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను సంప్రదించగా, ఆమె దాదాపుగా ఓకె చెప్పినట్టు తెలుస్తుంది.

Published By: HashtagU Telugu Desk
Janhvy

Janhvy

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor)  మరింత దూకుడు పెంచుతోంది. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ NTR30 లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో మరో క్రేజీ ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రంలో నటించేందుకు ఆమె అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. చెర్రీ – బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కే చిత్రంలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను సంప్రదించగా, ఆమె దాదాపుగా ఓకె చెప్పినట్టు తెలుస్తుంది.

అదే నిజమైతే ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఇద్దరు అగ్ర హీరోలైన ఎన్టీఆర్, చరణ్ సరసన నటించే అరుదైన అవకాశం వరించనుంది. చరణ్‌తో కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇందులో చెర్రీ రెండు పాత్రల్లో నటిస్తాడని, ఒక హీరోయిన్‌గా జన్వీకపూర్ (Janhvi Kapoor), మరో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్‌ను ఎంపిక చేస్తారే టాక్ వినిపిస్తుంది. అయితే బాలీవుడ్ లో హిట్స్ లేక తీవ్ర నిరాశలో ఉన్న జాన్వీ టాలీవుడ్ లో తన అద్రుష్టాన్ని పరీక్షించుకోబోతోంది.

అయితే మెగా హీరోతో కలిసి నటిస్తుందా లేదా అనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, ఆ క్రేజ్ ను సక్సెస్ గా మల్చడంలో విఫలమవుతుందనే ఆరోపణలున్నాయి. అయితే బాలీవుడ్ (Bollywood) లో వరుస ఫెయిల్యూర్స్ పలుకరిస్తుండటంతో తండ్రి బోనీ కపూర్ సలహా మేరకు టాలీవుడ్ సినిమాలపై ద్రుష్టి పెడుతోంది. తల్లి శ్రీదేవి లాగే జాన్వీ కూడా హిట్స్ కొట్టాలని ఆమె ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Also Read: Baahubali 3: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. బాహుబలి మళ్లీ వచ్చేస్తున్నాడు, అప్డేట్ ఇదిగో!

  Last Updated: 22 Apr 2023, 05:03 PM IST