Site icon HashtagU Telugu

Jhanvi Kapoor: అందుకే తిరుమల శ్రీవారి పై అంత భక్తి.. ఎట్టకేలకు కారణం రివీల్ చేసిన జాన్వీకపూర్!

Jhanvi Kapoor

Jhanvi Kapoor

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి అందరికీ తెలిసిందే. దివంగత నటి అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తెగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. ధడక్ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో భాగంగా బిజీబిజీగా గడుపుతోంది జాన్వీ కపూర్. ఇటీవలే రామ్ చరణ్ సరసన నటించబోయే సినిమా పూజా కార్యక్రమంలో కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. అంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రెండు తెలుగు సినిమాలకు సైన్ చేసేసింది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే కనుక జాన్వీ కపూర్ కు తెలుగులో సినిమా అవకాశాలు క్యూ కట్టడం కాయం అని చెప్పవచ్చు. అయితే మామూలుగా జాన్వీ కపూర్ ఎక్కువగా తిరుమల తిరుపతిలో మనకు కనిపించడం అన్నది మనం గమనించే ఉంటాం. ఏడాదికి కనీసం నాలుగు ఐదు సార్లు తిరుమల తిరుపతికి వెళుతూ ఉంటుంది.

ఇటీవల పదే పదే తిరుమలలో కనిపిస్తోంది. శ్రీవారిపై అంతులేని భక్తితో జాన్వీ కపూర్ వరుసగా తిరుమలని సందర్శిస్తోంది. వీలైనంత వరకు జాన్వీ కపూర్ కాలినడకన తిరుమలకు వెళుతోంది. ఇటీవల జాన్వీ కపూర్ తిరుమలకి వెళుతూ మెట్లని మోకాళ్ళతో ఎక్కుతున్న దృశ్యాలు అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి. జాన్వీ కపూర్ కి ఇంత భక్తి ఏంటి అని అంతా అనుకున్నారు. అయితే తాజాగా జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిపై తనకున్న భక్తిని కారణాన్ని వివరించింది. మా అమ్మ శ్రీదేవి గారి వల్లే నాకు తిరుమలపై భక్తి ఇష్టం ఏర్పడ్డాయి. నేను చిన్నతనంలో ఉన్నప్పడే మా అమ్మ పలుమార్లు నన్ను తిరుమలకు తీసుకువచ్చిది. నాకు తిరుమలతో ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభందం ఉంది. ఇప్పటివరకు 50 సార్లు తిరుమలని సందర్శించాను. నేను తిరుమలకు వెళ్లిన ప్రతి సారీ నాకు ఏదో ఒక మంచి సంఘటన జరుగుతుంది అని జాన్వీ తెలిపింది. ఇక హీరోయిన్ గా జాన్వీ కపూర్ టాప్ ఫామ్ లో ఉంది.

Exit mobile version