స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన పెళ్లిపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. త్వరలో విడుదల కానున్న ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా జర్నలిస్టులు పెళ్లి గురించి ప్రశ్నించగా జాన్వీ స్పష్టమైన సమాధానం ఇచ్చారు.
Nara Lokesh London : లండన్‌లో ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా నారా లోకేష్
జాన్వీ మాట్లాడుతూ.. “ప్రస్తుతం నాకు పెళ్లి చేసుకునే ఆలోచన ఏమాత్రం లేదు. నా దృష్టి అంతా సినిమాలపైనే ఉంది. ఇంకా చేయాల్సిన ప్రాజెక్టులు, నెరవేర్చుకోవాల్సిన కలలు ఉన్నాయి. వివాహం చేసుకునే సమయం రావడానికి ఇంకా చాలానే ఉంది” అని తెలిపారు. ఆమె సమాధానం విన్న అభిమానులు, మీడియా వర్గాలు ఆమె కెరీర్‌పై చూపిస్తున్న ఫోకస్‌ను ప్రశంసిస్తున్నాయి.
అయితే బాలీవుడ్ వర్గాల్లో జాన్వీ వ్యక్తిగత జీవితం గురించి తరచూ చర్చ నడుస్తూనే ఉంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాన్వీ డేటింగ్‌లో ఉన్నారని టాక్ కొనసాగుతోంది. వీరిద్దరూ కలిసి పబ్లిక్ ఈవెంట్లలో కనిపించడం, సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్టులు ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరుస్తున్నాయి. అయినా జాన్వీ మాత్రం తన కెరీర్‌పైనే దృష్టి సారించాలనుకుంటున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె, బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీ ప్రాజెక్టులకూ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. పెళ్లి విషయాన్ని పక్కన పెట్టి, ప్రస్తుతం ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించడమే తన ప్రధాన లక్ష్యం అని ఆమె స్పష్టం చేశారు.