టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కలిసి నటించిన చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా గత ఏడాది విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచి భారీగా కలెక్షన్లను సాధించింది. అయితే ఈ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు డైరెక్టర్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ దసరా కానుకగా విడుదల అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.
ప్రస్తుతం దేవర పార్ట్ 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మరోవైపు ఎన్టీఆర్ వార్ 2 చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ దేవర సినిమా నుంచి మరో పోస్టర్ రిలీజ్ చేసింది. మార్చి 6న జాన్వీ కపూర్ 28వ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు అభిమానులు, సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. అలాగే ఆర్సీ 16 సినిమా నుంచి సైతం జాన్వీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఇటు దేవర టీం సైతం ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ తంగం పాత్రకు సంబంధించిన కొత్త పోస్టర్ షేర్ చేసింది.
Team #Devara wishes our alluring Thangam #JanhviKapoor a very happy birthday ❤️
Man of Masses @tarak9999 #KoratalaSiva #SaifAliKhan @anirudhofficial@NANDAMURIKALYAN @YuvasudhaArts @DevaraMovie pic.twitter.com/ms5UJPjdxl
— NTR Arts (@NTRArtsOfficial) March 6, 2025
ఇందులో జాన్వీ కపూర్ భుజాన చేపలను తగిలించుకుని నోటితో కత్తిని పట్టుకుని కనిపించింది. కోర చూపులు చూస్తూ కుర్రాళ్లను కట్టిపడేస్తుంది జాన్వీ. దీంతో ఈ బ్యూటీ లుక్స్ పై క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్స్. నడుము అందాలను చూపిస్తూనే చూపులతో జాన్వీ కపూర్ న్యూ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కాగా పార్ట్ 1 లో తారక్ జోడిగా బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమైంది జాన్వీ. ఈ సినిమాలో అచ్చతెలుగు పల్లెటూరి అమ్మాయిగా కనిపించి అందం, అభినయంతో కట్టిపడేసింది. ఇప్పుడు పార్ట్ 2 తో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతోంది.