Site icon HashtagU Telugu

Janhvi Kapoor : దేవర తర్వాత మెగా ఛాన్స్.. జాన్వి తెలుగులో పాగా వేసేందుకు రెడీ..!

Janhvi Kapoor First Attempt Super Success

Janhvi Kapoor First Attempt Super Success

Janhvi Kapoor శ్రీదేవి తనయ జాన్వి కపూర్ తెలుగులో ఎన్.టి.ఆర్ సరసన దేవర సినిమాలో నటిస్తుంది. తన తల్లి లానే తెలుగు, తమిళ భాషల్లో కూడా స్టార్ క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తుంది జాన్వి కపూర్ అయితే అమ్మడు టాలీవుడ్ ఎంట్రీ అనుకున్నట్టుగానే గ్రాండ్ గా జరుగుతుంది. దేవర తో అమ్మడు అదరగొట్టబోతుంది. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వి హీరోయిన్ గా తన మార్క్ చూపించనుంది. ఇక ఈ సినిమా తర్వాత రెండో తెలుగు ఆఫర్ ని కూడా మెగా ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తుంది.

జాన్వి కపూర్ సెకండ్ తెలుగు సినిమా రాం చరణ్ తో ఉంటుందని తెలుస్తుంది. మెగా పవర్ స్టార్ రాం చరణ్ గేం చేంజర్ తర్వాత బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సమంత తో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ పేర్లు వినబడగా ఫైనల్ గా చిత్ర యూనిట్ జాన్వి కపూర్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. జాన్వి కపూర్ తో చరణ్ చేయడం తో మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహం డబుల్ అవుతుంది.

అప్పట్లో చిరంజీవి, శ్రీదేవి పెయిర్ ఎంత క్రేజీగా అనిపిస్తుందో ఇప్పుడు చరణ్, జాన్వి కపూర్ జంట కూడా అంతే చూడముచ్చటగా ఉంటుంది. తప్పకుండా జాన్వి కపూర్ తెలుగులో దేవర తర్వాత మెగా ఆఫర్ అందుకోవడం ఆమె కెరీర్ కు ఎంతో లక్కీ అని చెప్పొచ్చు. ఉప్పెన తర్వాత తన సెకండ్ మూవీగా చరణ్ తో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు బుచ్చి బాబు.

తప్పకుండా అతనికి ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెస్తుందని చెప్పొచ్చు. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ మూవీగా ఆర్సీ 16వ సినిమా వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.

Also Read : Rashmika Mandanna : రష్మిక రెమ్యునరేషన్ నిర్మాతలను రిక్వెస్ట్ చేస్తుంది.. బేబీ ప్రొడ్యూసర్ ఏమన్నాడు అంటే..!