Nani – Janhvi Kapoor : నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస విజయాల్లో ఉన్నారు. దసరా, హాయ్ నాన్న సినిమాలతో సూపర్ హిట్స్ ని అందుకున్న నాని.. ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా చేయబోతున్నారు. దసరా మూవీతో నానికి మొదటి వంద కోట్ల సినిమా ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల.. ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ కథని సిద్ధం చేశారట. ప్రస్తుతం ఆ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.
ఇక ఈ సినిమాలో నానికి జోడిగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ని ఎంపిక చేసుకున్నారట. సౌత్ సినిమాలు పై ఫోకస్ పెట్టిన జాన్వీ.. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు. అలాగే సూర్య సినిమాలో కూడా హీరోయిన్ అవకాశం అందుకున్నట్లు సమాచారం. ఇక తాజాగా నానికి జోడిగా నటించేందుకు కూడా సిద్దమవుతున్నారట. ప్రస్తుతం ఈ వార్త ఫిలిం వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు గాని, నాని ఫ్యాన్స్ మాత్రం.. నిజమైతే బాగుండని అనుకుంటున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన వివరాలను అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట.
సరిపోదా శనివారం సినిమా విషయానికి వస్తే.. వివేక్ ఆత్రేయ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. గతంలో ఈ దర్శకుడు నానితో ‘అంటే సుందరానికి’ అనే క్లాస్ సినిమా చేసారు. కానీ ఈసారి ఓ మాస్ బొమ్మని సిద్ధం చేస్తున్నారు. ప్రియాంక మోహన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ చిత్రంగా రూపొందుతుంది. ఆగష్టు 29న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.