Site icon HashtagU Telugu

Janhvi Visit Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్

Jahnavy

Jahnavy

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కు తిరుమల వేంకటేశ్వరుడు అంటే అపారమైన నమ్మకం. పుట్టినరోజున మాత్రమే కాకుండా, ఇతర అకేషన్స్ లోనూ తిరుమలకు వస్తుంటారు. ఆమెకు చిన్నప్పట్నుంచే వేంకటేశ్వరుడి స్వామి పట్ల భక్తి ఎక్కువ. గతంలో ఓ ఇంటర్వ్యూలో తిరుమల గురించి మాట్లాడుతూ.. తనకు లార్డ్ బాలజీ అంటే చాలా ఇష్టమని, భవిష్యత్తులో మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకొని, తిరుమల సమీపంలో సెటిల్ అవుతానని తన మనసులోని మాట బయటపెట్టింది జాన్వీ. జాన్వీ ఇవాళ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. సాంప్రదాయ దుస్తుల్లో లంగా, ఓణీ ధరించి తెలుగింటి అమ్మాయిని గుర్తుచేసింది. ప్రస్తుతం జాన్వీ పిక్స్ వైరల్ గా మారుతున్నాయి. ఆమెతో పాటు కొందరు కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా ఉన్నారు.