Site icon HashtagU Telugu

Janhvi Kapoor : జాన్వి ఫస్ట్ అటెంప్ట్ అదుర్స్…!

Janhvi Kapoor First Attempt Super Success

Janhvi Kapoor First Attempt Super Success

శ్రీదేవి తనయురాలు జాన్వి కపూర్ బాలీవుడ్ లో ఆల్రెడీ స్టార్ క్రేజ్ తెచ్చుకోగా తన తల్లి లానే సౌత్ లో కూడా మెప్పించాలని చూస్తుంది. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఇక్కడ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకోవాలని చూస్తుంది. అందుకే ఎన్టీఆర్ ( NTR) తో దేవర ఛాన్స్ రాగానే ఓకే అనేసింది. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమా లో జాన్వి గ్లామర్ స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.

ఐతే దేవర (Devara) సినిమాలో జాన్వి నటిస్తుందని తెలిసినా ఇన్నాళ్లు ఆమెకు సంబందించిన పోస్టర్స్, అప్డేట్స్ ఇవ్వలేదు. కానీ ఈమధ్యనే చుట్టమల్లె సాంగ్ తో సత్తా చాటగా లేటెస్ట్ గా మరో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ రెండు సాంగ్స్ తో జాన్వి కపూర్ అదరగొట్టేసింది. అంతేకాదు రిలీజ్ ముందే జాన్వి (Janhvi Kapoor) ఫస్ట్ అటెంప్ట్ అదుర్స్ అనిపించేలా చేస్తుంది. జాన్వి కపూర్ తొలి తెలుగు సినిమా దేవర మీద చాలా హోప్స్ పెట్టుకుంది.

ఆచార్య తర్వాత కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న సినిమా కాబట్టి ఈ ప్రాజెక్ట్ పై అనుమానాలు ఉన్నాయి. ఐతే తారక్ మాత్రం సినిమాతో కచ్చితంగా అనుకున్న టార్గెట్ రీచ్ అవుతున్నాం అనేలా కృషి చేస్తున్నాడు. సినిమాకు అనిరుద్ అందించే మ్యూజిక్ కూడా సినిమాకు హెల్ప్ చేసేలా ఉంది. ఎన్టీఆర్ జాన్వి జోడీ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందని అంటున్నారు.దేవర 1 సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా విషయంలో తారక్ ఫ్యాన్స్ అయితే సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.