Site icon HashtagU Telugu

Janhvi Kapoor: సౌత్ సినిమాలపై జాన్వీ రియాక్షన్!

Janhvi

Janhvi

ఆల్ ఇండియా సూపర్ స్టార్ శ్రీదేవి కూతురు బోనీ కపూర్ సౌత్ ఇండియన్ సినిమాల గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. దక్షిణాది సినిమాలే అగ్రస్థానంలో ఉన్నాయని చెప్పింది. త్వరలో సౌత్ ఇండియన్ సినిమా చేయాలనే కోరికను కూడా వ్యక్తం చేసింది. ‘‘నేను నిజంగా సౌత్ ఇండియన్ సినిమాలో నటించాలనుకుంటున్నా.

సౌత్ వర్కింగ్ స్టైయిల్, మ్యూజిక్ కు నేను పెద్ద అభిమానిని” అని జాన్వీ క్లారిటీ ఇచ్చింది. సౌత్ వర్సెస్ నార్త్ అనే చర్చ తనకు అర్థం కావడం లేదని, “మేం భారతదేశం కోసం మాత్రమే సినిమాలు చేస్తున్నాం’’ అని సమాధానమిచ్చింది. నార్త్, సౌత్ వేర్వేరు కాదు.. ఓన్లీ ఇండియన్ సినిమా అని మరోసారి చెప్పింది.