బాలీవుడ్ స్టార్ శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ (Janhvi kapoor) ప్రస్తుతం టాలీవుడ్‌పై పూర్తి ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌తో దేవర సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టిన ఆమె, ఇప్పుడు రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ అనే సినిమాలో నటిస్తోంది. వరుసగా రెండు పెద్ద చిత్రాల్లో అవకాశం దక్కించుకోవడంతో, జాన్వీకు తెలుగులో భారీ ఫాలోయింగ్ ఏర్పడుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా జాన్వీతో డైరెక్టర్ బుచ్చిబాబు సనా కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ ఫోటో హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో తీసినట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు, జాన్వీ కపూర్ ఇద్దరూ కలిసి హరి హర వీరమల్లు చూసేందుకు హాజరైనట్లు తెలుస్తోంది. సింపుల్ పింక్ జాకెట్, బ్లాక్ జీన్స్‌లో జాన్వీ స్టైలిష్‌గా కనిపిస్తూ యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంది. పెద్ది సినిమాకు సంబంధించి ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుగుతోంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ అందిస్తున్న సంగీతం ఈ సినిమాకి మరో హైలైట్‌గా నిలవనుంది. ఇది రూరల్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న మాస్ డ్రామా కావడంతో వివిధ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. దివ్యేండూ శర్మ, శివరాజ్‌కుమార్, జగపతిబాబు వంటి నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.