Site icon HashtagU Telugu

Janhvi Diwali Vibes: దీపావళి వెలుగులు.. జాన్వీ కపూర్ మెరుపులు!

Janhvi

Janhvi

బాలీవుడ్‌ హీరోయిన్స్ దీపావళి ముందుగానే సెలబ్రేట్ చేసుకుంటూ ఆకట్టుకుంటున్నారు. పదిరోజుల ముందు నుంచే దీపావళి సంబరాలు ప్రారంభించేశారు. రోజూ పార్టీలంటూ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎంజాయ్‌ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్రా తన ఇంట్లో.. స్నేహితులు, కుటుంబ సభ్యులకు దివాళి పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి పలువురు బీటౌన్‌ తారలు హాజరై సందడి చేశారు. ఐశ్వర్య రాయ్‌-అభిషేక్‌ బచ్చన్‌, కత్రినా-విక్కీ కౌశల్‌, కాజోల్‌, కియారా అడ్వాణీ, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కరిష్మా కపూర్‌, సారా అలీఖాన్‌, అనన్య పాండే అటెండ్ అయ్యారు.

వీరితో పాటు సుహానాఖాన్‌, శిల్పాశెట్టి, జాన్వీ కపూర్‌, ఖుషీ కపూర్‌ తదితర తారలు పార్టీలో కనిపించారు. ఫొటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా జాన్వీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  తన తండ్రి బోనీ కపూర్, సిస్టర్ ఖుషీతో కలిసి సందడి చేసింది. గ్రీన్ కలర్ దుస్తుల్లో హోయలు ఒలకబోసిన జాన్వీ అందాలను చూసిన ఫ్యాన్స్ వావ్ జాన్వీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.