Site icon HashtagU Telugu

Jani Master : జనసేన పార్టీకి దూరంగా ఉండాలి.. జానీ మాస్టర్ కి పార్టీ ఆదేశాలు..

Janasena Party Avoides Jani Master Official Statement Given

Jani Master

Jani Master : ఇవాళ ఉదయం నుంచి జానీ మాస్టర్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఓ మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసింది. తనని కొన్నాళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడు అని, మతం మారి పెళ్లి చేసుకొమ్మని జానీ మాస్టర్ బలవంతం చేస్తున్నాడని, తనని బెదిరించాడని మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదులో పేర్కొంది.

ప్రస్తుతం జానీ మాస్టర్ పై కేసు నమోదు చేసి నార్సింగి పోలీసులు విచారణ చేపట్టారు. అయితే జానీ మాస్టర్ జనసేన పార్టీలో ఎప్పట్నుంచో కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో జనసేన పార్టీ తరపున బాగా ప్రచారం కూడా చేసాడు జానీ మాస్టర్. పవన్ కళ్యాణ్ కూడా జానీ మాస్టర్ పై అభినందనలు కురిపించారు. ముందు నుంచి జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరించారు జానీ మాస్టర్.

నేడు జానీ మాస్టర్ పై ఆరోపణలు రావడంతో వైసీపీ నాయకులు జానీ మాస్టర్ ని, పవన్ కళ్యాణ్ ని, జనసేన పార్టీని విమర్శిస్తున్నారు. దీంతో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. జానీ మాస్టర్ ని పార్టీకి దూరంగా ఉండాలంటూ అధికారిక ప్రకటన విడుదల చేసారు.

ఈ ప్రకటనలో.. జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని శ్రీ షేక్ జానీని ఆదేశించడమైనది. ఆయనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన క్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకొంది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది అని జనసేన పార్టీ హెడ్, కానిక్ట్ మేనేజ్మెంట్ ప్రతినిధి వేములపాటి అజయ కుమార్ లేఖను విడుదల చేసారు.

Also Read : Shanmukh Jaswanth : హీరోగా మారుతున్న షన్ను.. వెండితెరపై మెప్పిస్తాడా..?