Allu Arjun : పవన్‌కి ఒక ట్వీట్ పడేసి.. వైసీపీకి ప్రచారం చేస్తున్న బన్నీ.. జనసైనికుల విమర్శలు..

పవన్‌కి ఒక చిన్న ట్వీట్ తో మద్దతు తెలిపిన అల్లు అర్జున్.. వైసీపీ లీడర్ అయిన తన మిత్రుడు కోసం ఇంటివరకు వెళ్లి మద్దతు తెలపడం జనసైనికుల ఆగ్రహానికి గురి చేస్తుంది.

Published By: HashtagU Telugu Desk
Janasena Followers Mega Fans Were Anger On Allu Arjun Campaign For Ysrcp Leader

Janasena Followers Mega Fans Were Anger On Allu Arjun Campaign For Ysrcp Leader

Allu Arjun : అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయంతో ఏపీ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. మెగా ఫ్యామిలీ అంతా జనసేన కోసం పోరాడుతుంటే.. అల్లు అర్జున్ వైసీపీ తరుపున ప్రచారానికి దిగి అందరికి పెద్ద షాక్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కి తన మద్దతు తెలుపుతూ చిరంజీవి వీడియో బైట్ ని రిలీజ్ చేస్తే.. వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, వైష్ణవ్ తేజ్ ప్రచారం చేస్తూ పవన్ కోసం పోరాడుతున్నారు. ఇక ఫైనల్ టచ్ గా నేడు పిఠాపురంకి రామ్ చరణ్ వెళ్లి పవన్ కి మద్దతు తెలుపుతున్నారు.

మెగా ఫ్యామిలీ మాత్రమే కాదు, అల్లు కుటుంబసభ్యులు కూడా పవన్ కి మద్దతు తెలుపుతున్నారు. అల్లు శిరీష్ పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతూ నేడు ఒక ట్వీట్ వేశారు. ఇక అల్లు అరవింద్.. రామ్ చరణ్ తో కలిసి నేడు పిఠాపురంకి వెళ్లారు. అక్కడ పవన్ ని కలిసి తన మద్దతుని తెలియజేయనున్నారు. ఇలా వీరంతా ఒక పక్క ఉంటే.. అల్లు అర్జున్ మాత్రం వైసీపీ లీడర్ కి సపోర్ట్ చేయడానికి వెళ్లడం, అది కూడా ఎన్నికల ప్రచారం చివరి రోజున కావడంతో మెగా అభిమానులను, జనసైనికులను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తుంది.

నంద్యాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవిచంద్ర కిషోర్ రెడ్డి.. అల్లు అర్జున్ కి మంచి స్నేహితుడు మరియు స్నేహారెడ్డి కుటుంబం నుంచి బంధువు అని తెలుస్తుంది. అయితే అతను ఎంత దగ్గర వ్యక్తి అయినా.. తనకంటే ముందు పవన్ కళ్యాణ్ తమ కుటుంబసభ్యుడు. అలాంటి వ్యక్తికి ఒక చిన్న ట్వీట్ తో మద్దతు తెలిపి.. వైసీపీ లీడర్ అయిన తన మిత్రుడు కోసం ఇంటివరకు వెళ్లి మద్దతు తెలపడం కొందరు అల్లు అభిమానులను సైతం బాధిస్తుంది.

అల్లు అర్జున్ ఇలా వైసీపీ ఇంటికి వరకు వచ్చి మద్దతు తెలపడం కాకుండా.. తన స్నేహితుడికి ఫోన్ లోనే విషెస్ లేదా పవన్ కి చెప్పినట్లు ట్వీట్ తో తెలియజేసి ఉంటే బాగుండని కొందరు అల్లు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఇంటికి వచ్చి విషెస్ తెలియజేయడంతో.. వైసీపీ లీడర్స్ జనసేనకి వ్యతిరేకంగా దీనిని ఉపయోగించుకుంటున్నారని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అయితే జనసైనికులు, మెగా అభిమానులు మాత్రం అల్లు అర్జున్ పై తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ తన గౌరవాన్ని పోగుట్టుకుంటున్నారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరి అల్లు అర్జున్ నిర్ణయం రేపు ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో చూడాలి.

  Last Updated: 11 May 2024, 01:32 PM IST