Site icon HashtagU Telugu

Jailer Trailer Talk – ‘ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు.. కోతలే’

Jailer Collections

Jailer Trailer

‘ఈ వ్యాధి వచ్చిన వారు పిల్లిలా ఉంటారు. కానీ ఒక్కసారి దడేల్‍గా పులిలా మారుతారు..ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు.. కోతలే’ ఈ డైలాగ్స్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ (Jailer) మూవీ లోనివి. రజనీకాంత్ , తమన్నా జంటగా సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మించిన మూవీ జైలర్.

యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ ని నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson ) డైరెక్ట్ చేసారు. ఆగస్టు 10 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ఫై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్ గా విడుదలైన ‘వా.. నువ్వు కావాలయ్యా.. నువ్వు కావాలి’ సాంగ్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ పాట విన్నవారంతా ఈ సాంగ్ ఏ చిత్రంలోనిదో అంటూ వెతకడం స్టార్ట్ చేసారు. అంతలా ఈ సాంగ్ ఊపేస్తోంది. ఇక ఇప్పుడు చిత్ర ట్రైలర్ ను విడుదల చేసి ఆకట్టుకున్నారు.

ట్రైలర్ అంత కూడా యాక్షన్ ప్యాక్ తో నింపేశారు. అభిమానులు రజనీ (Rajinikanth)ని ఎలా చూడాలనుకుంటున్నారో ఆ విధంగా సినిమాలో డైరెక్టర్ నెల్సన్ చూపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. కేవలం యాక్షన్స్ సన్నివేశాలే కాదు డైలాగ్స్ కూడా కుమ్మేసాయి. “ఈ వ్యాధి వచ్చిన వారు పిల్లిలా ఉంటారు. కానీ ఒక్కసారి దడేల్‍గా పులిలా మారుతారు” అంటూ బ్యాక్​గ్రౌండ్​లో రజినీని ఉద్దేశిస్తూ వచ్చిన డైలాగ్​తో సినిమాలో రజనీకాంత్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పాడు. అలాగే “ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు.. కోతలే” అనే డైలాగ్ మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సినిమాలో కామెడీ కూడా గట్టిగానే ఉన్నట్లు సునీల్ వేసిన పంచ్ డైలాగ్ వింటే అర్ధం అవుతుంది. ఓవరాల్ గా జైలర్ ట్రైలర్ తో సినిమా ఫై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ మూవీ లో జాకీష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ, మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్‌ మొదలగువారు నటించారు.

Read Also : భోళా శంకర్ సెన్సార్ పూర్తి ..