Box Office : సోమవారం కూడా జైలర్ హావ తగ్గలే..

సరైన కథ పడలేకాని బాక్సాఫీస్ ఊచకోత అని నిరూపించాడు

Published By: HashtagU Telugu Desk
Jailer Latest Collections

Jailer Latest Collections

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth ) సత్తా ఏంటో మరోసారి రుజువైంది. సరైన కథ పడలేకాని బాక్సాఫీస్ ఊచకోత అని నిరూపించాడు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో రజనీకాంత్ హీరోగా తమన్నా, రమ్యకృష్ణ, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీష్రాఫ్ తదితరులు కీలక పాత్రలను పోషించిన జైలర్ (Jailer)మూవీ.. ఆగస్టు 10 న తెలుగు , తమిళ్ భాషల్లో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో బాక్స్ ఆఫీస్ (Box Office) వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. కేవలం వీకెండ్ రోజుల్లోనే కాదు..నిన్న సోమవారం కూడా హౌస్ ఫుల్ కలెక్షన్లతో కుమ్మేసింది.

తెలంగాణ తో పాటు ఆంధ్ర లో ఈ చిత్రం ఏకంగా సోమవారం రూ. 3 కోట్లు వరకూ షేర్ రాబట్టింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా రూ. 20 కోట్లు లోపు షేర్ రాబట్టింది. దీంతో ఈ చిత్రం మొత్తంగా రూ. 160 కోట్లు వరకూ షేర్‌తో పాటు రూ. 350 కోట్లు వరకూ గ్రాస్‌ను వసూలు చేసింది. అటు చిరంజీవి నటించిన భోళా శంకర్ (Bhola Shankar) మూవీ మాత్రం రోజు రోజుకు దారుణంగా పడిపోతుంది. మొదటి రోజు మొదటి షో తోనే నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం..బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన కలెక్షన్లు రాబడుతుంది. సోమవారం తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ. 1.50 కోట్లు వరకూ షేర్‌ను వసూళ్లు చేయగా.. వరల్డ్ వైడ్‌గా రూ. 1.70 కోట్లను మాత్రమే రాబట్టింది. ఇలా ఇప్పటి వరకూ రూ. 28 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. అంతే కాదు చాల చోట్ల భోళాశంకర్ ను తప్పించి , జైలర్ మూవీ ని ప్రదర్శిస్తున్నారు.

Read Also : పవన్ కల్యాణ్‌ వెంట్రుక కూడా పీకలేపోయాడంటూ మంత్రి అమర్నాథ్‌ కౌంటర్

  Last Updated: 15 Aug 2023, 10:54 AM IST