Site icon HashtagU Telugu

Rajinikanth : జైలర్ హుకుం సాంగ్.. బ్యాక్ స్టోరీ ఇదే..!

Crazy Title for Rajinikanth Jailer 2

Crazy Title for Rajinikanth Jailer 2

సూపర్ స్టార్ రజినికాంత్ (Rajinikanth) నెల్సన్ దిలీప్ కుమార్ ఇద్దరు కలిసి చేసిన సెన్సేషనల్ మూవీ జైలర్. ఈ సినిమాతో రజిని ఫ్యాన్స్ ఆకలి తీర్చేశాడు నెల్సన్. ముఖ్యంగా సినిమాకు అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. జైలర్ సినిమాలో హుకుం సాంగ్ సినిమాకు వన్ ఆఫ్ ది హైలెట్ అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాలో ఈ సాంగ్ గురించి అనిరుద్ ఓ సీక్రెట్ చెప్పాడు. జైలర్ సినిమాకు ఒక సాంగ్ తో పూర్తి చేద్దామని అనుకోగా అప్పటికే అది పూర్తి చేశారట.

ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్న టైం లో రజిని హుకుం డైలాగ్ బాగా వస్తుండటం వల్ల అలా ఓ సాంగ్ చేస్తే బాగుంటుందని అనుకున్నారట. వెంటనే అనిరుద్ కంపోజ్ చేయడం లిరిక్స్ రాయించడం చక చకా జరిగాయి. అలా జైలర్ లో హుకుం పాట సెన్సేషనల్ అయ్యింది. జైలర్ అంటే ముందు ఈ సాంగ్ గుర్తొచ్చేలా చేశాడు అనిరుద్.

ఈ సాంగ్ ని ఇప్పటికి 81 మిలియన్ల మంది వీక్షించారు. అతి తక్కువ టైం లో ఈ రేంజ్ వ్యూస్ తెచ్చుకున్న సాంగ్ ఇదే అని చెప్పొచ్చు. అనిరుద్ ఈమధ్య ఏ సినిమాకు మ్యూజిక్ ఇచ్చినా అది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ విక్రం సినిమాకు అతను ఇచ్చిన మ్యూజిక్ వేరే రేంజ్ కి వెళ్లగా.. ఇప్పుడు జైలర్ సినిమాకు అతని మ్యూజిక్ అదరగొట్టింది.

జైలర్ సినిమా కోసం లాస్ట్ మినిట్ లో సిద్ధం చేసిన హుకుం సాంగ్ ఈ రేంజ్ సెన్సేషనల్ అవడం ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. జైలర్ తో రజిని తిరిగి సూపర్ ఫాం లోకి రాగా ఫ్యాన్స్ అందరు సూపర్ స్టార్ ఇదే ఫాం కొనసాగించాలని కోరుతున్నారు.

Also Read : RC16 : బేబమ్మని వదలని బుచ్చి బాబు..!