Jai Hanuman ప్రశాంత వర్మ డైరెక్షన్లో సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన చెక్క తెలిసిందే. స్టార్ సినిమాలకు దీటుగా వసూళ్లను రాబట్టిన ఈ మూవీ ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పింది. కంటెంట్ ఉంటే స్టార్ కట్ అవుట్ తో పని లేదని మరోసారి ప్రూవ్ చేసింది. 30 కోట్ల బిజినెస్ తో రిలీజ్ అయిన హనుమాన్ సినిమా వరల్డ్ వైడ్ గా 300 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది అంటే సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా చూసిన అందరూ ప్రశాంతవర్మని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
టాలీవుడ్ కి మరో టాలెంటెడ్ డైరెక్టర్ దొరికాడని చెప్పుకుంటున్నారు. హనుమాన్ సెన్సేషనల్ హిట్ అవటంతో ఆ సినిమా సీక్వెల్ గా ప్లాన్ చేసిన జై హనుమాన్ గురించి ఇప్పుడు అందరూ డిస్కస్ చేస్తున్నారు. జై హనుమాన్ విషయంలో ప్రశాంత్ వర్మ ప్లాన్ ఏంటి అన్నది తెలియదు కానీ ఆ సినిమా హనుమాన్ ని మించి ఉండబోతుందని మాత్రం అర్థమవుతుంది. బడ్జెట్ విషయంలో కూడా ఈసారి ఎలాంటి లిమిట్స్ ఉండవని చెప్పొచ్చు. అయితే జై హనుమాన్ లో హనుమాన్ పాత్రకి ఒక స్టార్ హీరో నటిస్తాడని ప్రశాంత్ వర్మ వెల్లడించాడు.
అప్పటినుండి బాలీవుడ్ లో పలానా హీరో హనుమాన్ గా చేస్తాడని టాలీవుడ్ లో మరో స్టార్ హీరో హనుమాన్ సినిమాలో భాగమవుతాడని లేటెస్ట్ గా కేజిఎఫ్ హీరో యష్ హనుమాన్ గా నటిస్తాడని వార్తలు వచ్చాయి. ఈ వార్తల్ని చిత్ర యూనిట్ కూడా ఖండించలేదు. సినిమా గురించి ఈ రేంజ్ డిస్కషన్ జరగటం జై హనుమాన్ కి పాజిటివ్ అంశమే అని ప్రశాంత్ వర్మ సైలెంట్ గా ఉన్నాడు. ఇలా ఎలాగోలా జై హనుమాన్ గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తుంది ఈ విషయాల మీద క్లారిటీ ఉండదని చెప్పొచ్చు.