Jai Balayya: దటీజ్ బాలకృష్ణ..  ఐపీఎల్ లో ‘జై బాలయ్య’ నినాదాలు, చక్కర్లు కొడుతున్న వీడియో!

తెలుగు రాష్ట్రాల యువతకు క్రికెట్ ఎంత ఇష్టమో, అంతకు మించి సినిమాలు అంటే మహా ఇష్టం.

Published By: HashtagU Telugu Desk
Balakrishna

Balakrishna

ఐపీఎల్ (IPL) మ్యాచులు ప్రేక్షకులకు మస్త్ మజాను అందిస్తున్నాయి. ఇప్పటికే విద్యార్థుల (Students) పరీక్షలు పూర్తి కావడంతో హైదరాబాద్ (Hyderabad) వేదికగా జరిగే మ్యాచ్ లు జనాలతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. తమ అభిమాన జట్టు సన్ రైజర్స్ కు మద్దతు తెలుపుతూ స్టేడియంలో మ్యాచ్ లు చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల యువతకు క్రికెట్ ఎంత ఇష్టమో, అంతకు మించి సినిమాలు అంటే మహా ఇష్టం. ఐపీఎల్ మ్యాచ్  అయినా, వన్డే అయినా, టెస్టు మ్యాచ్ అయినా అభిమాన హీరో (Hero) పేరు గ్రౌండ్ లో దద్దరిల్లిపోవాల్సిందే.

మాస్ జనాల్లో నందమూరి హీరో బాలయ్య (Nandamuri Balakrishna) బాబు అంటే ఫుల్ క్రేజ్. స్టేడియంలో తమ అభిమాన క్రికెట్ సిక్స్ బాదినా, అవతలి బ్యాట్స్ మెన్స్ ను మన బౌలర్ ఔట్ చేసినా హీరో పేరు మార్మోగిపోవాల్సిందే.  ఈ నేపథ్యంలో ఉప్పల్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో బాలయ్య బాబు నినాదాలు ఆకాశాన్ని తాకాయి. ఒకవైపు మ్యాచ్ చూస్తూనే, మరోవైపు ఫెవరెట్ హీరో నినాదాలు చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘‘కోకాకోలా పెప్సీ, బాలయ్య బాబు సెక్సీ,  జై బాలయ్య.. జైజై బాలయ్య (Jai Balayya)’’ అంటూ నినాదాలు చేయడం చూడొచ్చు.

నందమూరి బాలకృష్ణ చివరిసారిగా ఇటీవల విడుదలైన వీర సింహ రెడ్డిలో కనిపించారు. ఇది బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. జై బాలయ్య అనే పదం ఇప్పుడు ఒక ఎమోషన్ (Emotion) గా మారింది. సందర్భం ఏదైనా సరే బాలయ్యను గుర్తు చేసుకోవాల్సిందే. అందుకే బాలయ్య బాబు కూడా అభిమానులను ద్రుష్టిలో పెట్టుకొని మాస్ సినిమాలు చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాడు.

Also Read: Samantha Reaction: శాకుంతలం ఫెయిల్యూర్ పై సమంత రియాక్షన్.. గీతోపదేశం చేస్తూ కౌంటర్!

  Last Updated: 18 Apr 2023, 05:54 PM IST