అందాల భామ జాన్వి కపూర్ కేవలం సినిమాలే కాదు ఫోటో షూట్స్ తో కూడా పిచ్చెక్కిస్తుంది. నార్త్ ఆడియన్స్ జాన్వి గ్లామర్ ని అర్ధం చేసుకున్నారు ఐతే సౌత్ ఆడియన్స్ కి ఈమధ్యనే దేవర (Devara) సినిమాతో పరిచయమైన జాన్వి తన అందాల వలలో వాళ్లని ఉక్క్రి బిక్కిరి అయ్యేలా చేస్తుంది. జాన్వి (Jahnvi Kapoor) ఫోటో షూట్ వచ్చింది అంటే చాలు ఆమె ఎందుకు ఈ షో చేస్తుందా అని డీ కోడ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. కానీ జాన్వి వాళ్లకెవరికీ అంత ఈజీగా దొరికే టైపు ఏమి కాదు.
కథానాయిక అన్న తర్వాత ఒక్కొక్కరికి ఒక్కో లెక్క ఉంటుంది. అలానే జాన్వి గ్లామర్ కి ఒక లెక్క ఉందనిపించేలా అమ్మడి రెచ్చిపోతుంది. ఏదో షో చేద్దాం అన్నట్టు కాకుండా అతడు సినిమాలో తణికెళ్ల భరణి చెప్పినట్టుగా చాలా శ్రద్ధగా ఒక మొక్కకు అంటు కట్టినట్టు.. ఒక గోడ కడుతున్నట్టు పద్ధతిగా చూపిస్తుంది. అందరు గ్లామర్ షో చేస్తారు కానీ జాన్వి చేస్తున్న షో నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది.
అందుకే ముందు చెప్పినట్టుగా జాన్వి కపూర్ గ్లామర్ కి ఒక లెక్క ఉంటుందనిపిస్తుంది అంటే అందరు నిజమే అని ఒప్పుకోవాల్సిందే. ముఖ్యంగా జాన్వి లేటెస్ట్ గా డార్క్ క్రీం కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ లో దేవకన్య ఇలా నేల మీదకు వచ్చిందా అనిపించేలా చేస్తుంది. ఆడియన్స్ ని బుట్టలో వేసుకోవాలో బాగా తెలిసిన జాన్వి కపూర్ తన గ్లామర్ టీట్ తో ఫాలోవర్స్ కి నోట మాట రాకుండా చేస్తుంది. అందుకే సినిమా అయినా ఫోటో షూట్ (Photoshoot) అయినా జాన్వి ని మించిన వారు లేరని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. దేవర తో టాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వి నెక్స్ట్ గ్లోబల్ స్టార్ రాం చరణ్ తో రచ్చ చేసేందుకు సిద్ధమవుతుంది.