Jagapati Babu ఒకప్పుడు హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించిన సీనియర్ హీరో జగపతి బాబు లెజెండ్ సినిమాతో విలన్ గా టర్న్ అయ్యి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. ఇక అప్పటి నుణి జగపతి బాబు విలనిజం ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది.
విలన్ గా మారిన తర్వాత జగపతి బాబు దాదాపు 90 కి పైగా సినిమాలు చేశారని ఈమధ్యనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇదిలాఉంటే లేటెస్ట్ గా జగపతి బాబు జపాన్ వెళ్లగా అక్కడ ఆడియన్స్ తనని సర్ ప్రైజ్ చేశారు.
తెలుగు స్టార్స్ కి జపాన్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ సినిమాలు జపాన్ లో కూడా ఒక రేంజ్ లో హిట్ అయ్యాయి. అయితే తెలుగులో ఒకప్పుడు హీరోగా ఆ తర్వాత విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న జగపతి బాబుకి కూడా జపాన్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.
Also Read : Devara : ‘దేవర’ ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్.. ఆల్ హెయిల్ టైగర్..
జపాన్ లో జగ్గు భాయ్ ని ఆయన అభిమానులు బాగా రిసీవ్ చేసుకున్నారు. ముఖ్యంగా అక్కడ లేడీ ఫ్యాన్స్ జగపతి బాబుని చూసి ఎమోషనల్ అయ్యారు.
ఎన్నో ఏళ్లుగా జపాన్ రావాలని అనుకున్నా ఇన్నాళ్లకు కుదిరింది. ఇక నుంచి ప్రతి ఏడాది ఇక్కడకు వస్తానని అన్నాడు జగపతి బాబు. అక్కడ లేడీ ఫ్యాన్స్ అంతా జగపతి బాబుతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు.
జపాన్ లో తనకు దక్కిన ఈ ఆదారాభిమానం మన జగ్గు భాయ్ ని సర్ ప్రైజ్ చేసింది. ప్రస్తుతం జగపతి బాబు జపాన్ ఆడియన్స్ లో ఇంటరాక్ట్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని తన ట్విట్టర్ లో షేర్ చేసిన జగపతి బాబు చందమామ లాగా చల్లగా ఆహ్వానించిన జపనీస్ తారలు అంటూ కామెంట్ పెట్టారు.
Chandumama laaga challaga ahwaninchina Japanese Thaaralu. pic.twitter.com/rjGk38kfOs
— Jaggu Bhai (@IamJagguBhai) May 17, 2024