Site icon HashtagU Telugu

Jagapathi Babu: నా రెమ్యునరేషన్ తగ్గించి మరి రుద్రంగి సినిమా చేశాను. కానీ..!

Jagapathi Babu

Jagapathi Babu

టాలీవుడ్ నటుడు జగపతిబాబు ఒకప్పుడు హీరోగా వెలుగు వెలిగి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ రాణిస్తూ ఆకట్టుకుంటున్నాడు. అయితే ఇటీవల ఈ నటుడు ప్రధాన పాత్రలో నటించిన రుద్రంగి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు జగపతి బాబు. ఈ సినిమా ఫలితం తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని అన్నారు. ’‘రుద్రంగి కథ నచ్చడంతో రెమ్యునరేషన్ తగ్గించి సినిమా చేశాను కానీ, ఆ సినిమా నిర్మాత ఎమ్మెల్యే కూడా సరైన ప్రమోషన్స్ చేయలేదు.

సినిమా బాగా వ‌స్తుంద‌ని వాళ్లు అనుకోలేదు. అందుకే నాలుగు రోజుల్లోనే రుద్రంగి సినిమాను థియేటర్ల నుంచి తొలగించారు. దీంతో నా సినిమా దిక్కులేని అనాథగా మారింది. ఎనిమిది కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. నా రేంజ్ లేకపోయినా సినిమా చేశాను. అయితే సినిమాను ఓటీటీలో విడుదల చేయమని సలహా కూడా ఇచ్చాను. నిర్మాత ఇవేమీ పట్టించుకోలేదు.’ అని జగపతి బాబు అన్నారు. ప్రస్తుతం జగ్గుభాయ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

జగపతి బాబు నటించిన రుద్రంగి సినిమాలో మమతా మోహన్ దాస్ కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించగా, తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించారు. జూలై 7న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది. అయితే థియేటర్లలో వారంరోజులకే మాయమైన సినిమా ఓటీటీలో పర్వాలేదని అనిపించింది. కచ్చితమైన ప్లాన్ తో ఈ మూవీ చేస్తే ఈ మూవీ మరింత బాగా ఆడేదని సినీ ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.

Also Read: Food Poison: వినాయక చవితి ప్రసాదం తిని 79 మందికి అస్వస్థత