Pushpa2 Update: పుష్ప-2లోకి జగ్గూబాయ్ ఎంట్రీ.. కీలక పాత్రలో జగపతి బాబు!

విలక్షణ నటుడు జగపతి బాబు పుష్ప2 పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నట్లు స్పష్టం చేశాడు.

Published By: HashtagU Telugu Desk
Pushpa2

Pushpa2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప ది రూల్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పుష్ప1 ఊహించనివిధంగా హిట్ కావడంతో పార్ట్ 2  (Pushpa2) పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఒకవైపు అల్లు అర్జున్, మరోవైపు సుకుమార్ (Sukumar) వందశాతం ఎఫర్ట్ పెట్టి పనిచేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకుంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుండటంతో ఇండియాలో మోస్ట్ ఎవైటెడ్ మూవీగా మారింది. ఈ చిత్రం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2024 సమ్మర్ లో విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్ డేట్ ఏంటంటే.. విలక్షణ నటుడు జగపతి బాబు ఈ మూవీలో నటిస్తున్నట్లు స్పష్టం చేశాడు. సల్మాన్ ఖాన్ ’కిసీ కా భాయ్ కిసీ కి జాన్‘ ప్రమోషన్స్ లో పాల్గొన్న జగపతిబాబు (Jagapathi Babu) పుష్ప2 గురించి మాట్లాడారు.

రంగస్థలం తర్వాత దర్శకుడు సుకుమార్‌తో జగపతి బాబు మళ్లీ కలవడానికి ఉత్సాహంగా ఉన్నాడు. “సుకు (సుకుమార్)తో కలిసి పనిచేయడం ఎల్లప్పుడూ ఎగ్జైటింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే తర్వాత ఏమి జరగబోతోందో మీకు తెలియదు. పుష్ప 2 ఒక ఛాలెంజ్, నేను సవాళ్లను ప్రేమిస్తున్నాను. సుకుమార్ నాకు మంచి పాత్రలు ఇచ్చాడు. అతనితో ఎప్పుడైనా పనిచేయడం నాకు చాలా ఇష్టం. పుష్ప విషయానికొస్తే, మొదటి భాగం నాకు నచ్చింది” అని ఆయన జగపతి బాబు (Jagapathi Babu) ధృవీకరించారు.

పాత్ర గురించి ఇతర వివరాలు అడిగినప్పుడు.. వచ్చే ఏడాది సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు రెడీగా ఉండండి అంటూ నవ్వుతూ బదులిచ్చాడు. ఒకప్పటి బన్నీకి, ఇప్పటి బన్నీ (Allu Arjun) చాలా తేడా ఉందనీ, 20 సంవత్సరాల క్రితం సాధారణ వ్యక్తి అని, ఇప్పుడు అభిమానులకు ఐకాన్ స్టార్ అని అన్నాడు. ఇక సల్మాన్ ఖాన్ తో పనిచేయడం చాలా గొప్ప ఉందని, కూల్ గా కూడా ఉందని కూడా చెప్పారు. సల్మాన్ తో సమయం గడపడం నాకు చాలా ఇష్టం. సెట్స్‌లో అతని ఆటిట్యూడ్‌ నాకు చాలా ఇష్టం అని జగపతి అన్నారు.

Also Read: Ram Charan: షూటింగ్స్ కు రామ్ చరణ్ బ్రేక్..? పుట్టబోయే బిడ్డ కోసమేనా!

  Last Updated: 20 Apr 2023, 05:17 PM IST