Jagapathi Babu: జగపతిబాబు హీరో కాకపోయి ఉంటే ఆ ప్రొఫెషన్ లో ఉండేవారా?

టాలీవుడ్ హీరో, నటుడు జగపతి బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించి ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న జగపతి బాబు ప్రస్తుతం విలన్ క్యారెక్టర్ లలో నటిస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇటీవల కాలంలో విడుదల అవుతున్న ప్రతి పది తెలుగు సినిమాలలో కనీసం రెండు మూడు సినిమాలలో జగపతి బాబు తప్పకుండా నటిస్తున్నారు. ఒకవైపు పాజిటివ్ పాత్రలు చేస్తూనే మరొకవైపు విలన్ గా నెగటివ్ […]

Published By: HashtagU Telugu Desk
Mixcollage 18 Mar 2024 09 42 Am 1709

Mixcollage 18 Mar 2024 09 42 Am 1709

టాలీవుడ్ హీరో, నటుడు జగపతి బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించి ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న జగపతి బాబు ప్రస్తుతం విలన్ క్యారెక్టర్ లలో నటిస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇటీవల కాలంలో విడుదల అవుతున్న ప్రతి పది తెలుగు సినిమాలలో కనీసం రెండు మూడు సినిమాలలో జగపతి బాబు తప్పకుండా నటిస్తున్నారు. ఒకవైపు పాజిటివ్ పాత్రలు చేస్తూనే మరొకవైపు విలన్ గా నెగటివ్ పాత్రలు కూడా చేస్తూ అల్లరిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో జగపతిబాబు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ లో జగ్గూభాయ్ వేసే పోస్టులకు నెటిజెన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు జగపతిబాబు. ఇంతకీ ఆ పోస్టులో ఏముంది అన్న విషయంలో వస్తే.. పోలీస్ గెటప్ లో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. నేను సినిమాల్లోకి రాకపోయి ఉంటే కచ్చితంగా సూపర్ కాప్ అయ్యి ఉండేవాడిని.

 

ఇప్పుడున్న సూపర్ కాప్స్ లాగా నేను లా అండ్ ఆర్డర్ ని గడగడలాడించేవాడిని. ఎం అంటారు అంటూ రాసుకొచ్చారు. ఆ పోస్ట్ పై అభిమానులు నేటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. కాగా ప్రస్తుతం జగపతి బాబు చేతిలో సలార్ 2 లాంటి పెద్ద ప్రాజెక్ట్ తో పాటు మరికొన్ని సినిమాలు ఉన్నాయి. ఇలా ఈ వయసులో కూడా అదే ఊపుతో నటిస్తూ దూసుకుపోతున్నారు జగపతిబాబు.

  Last Updated: 18 Mar 2024, 09:43 AM IST