Padma Vibhushan 2025 : పద్మవిభూషణ్ నందమూరి బాలకృష్ణ కు మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ అభినందనలు తెలిపారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వ్యక్తులకు అత్యున్నత పౌర పురస్కారాలు అయిన పద్మ అవార్డులను ప్రకటించింది. 2025 సంవత్సరానికి గానూ, ఈ అవార్డులు ప్రకటించబడిన జాబితాలో అనేక గొప్ప వ్యక్తుల పేర్లు ఉన్నాయి. ఈ అవార్డులు కళలు, సాహిత్యం, వైద్యం, విద్య, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, క్రీడలు, వాణిజ్యం, పరిశ్రమలు, పౌర సేవ వంటి అనేక రంగాలలోని ప్రముఖులకు ఇచ్చి, వారి విశేష కృషిని గుర్తించనున్నారు.
పద్మవిభూషణ్ అవార్డుకు 7 గురు. 19 మంది వ్యక్తులకు పద్మభూషణ్ అవార్డు మరియు 113 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. ఇక పద్మవిభూషణ్ అందుకున్న వారిలో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నారు. బాలకృష్ణ(Balakrishna)కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించడం తో నందమూరి అభిమానుల ఆనందం మాములుగా లేదు. ఈ ప్రకటన రావడం ఆలస్యం సోషల్ మీడియా లో బాలయ్య పేరు మారుమోగిపోతుంది. సినీ , రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది తమ అభినందనలను తెలియజేయగా..తాజాగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సైతం బాలకృష్ణ ను ప్రత్యేకంగా అభినందించారు.
Flexi War : కడపలో వైసీపీ, జనసేన ఫ్లెక్సీల కలకలం
“విఖ్యాత వైద్యులు డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి గారికి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రకటించిన సందర్భంగా శుభాకాంక్షలు. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో చేసిన పరిశోధనలు వైద్యరంగంలో గొప్పగా నిలిచిపోతాయి. మంచి హస్తవాసి ఉన్న వైద్యుడు ఆయన. రోగులకు ఆత్మీయత పంచడమే కాదు, వారు తిరిగి కోలుకునేందుకు వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే గొప్ప మనసు ఆయనది. కొత్త కొత్త వ్యాధులకు చికిత్సనందించడంలో నాగేశ్వర్‌రెడ్డి సేవలు విశేషమైనవి. అత్యాధునిక వైద్య పద్ధతులు, చికిత్సా విధానాలను తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా విస్తరించడంలో ఆయనది కీలక పాత్ర. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారిని దేశం గొప్పగా గౌరవించుకోవడం తెలుగువారందరికీ గర్వకారణం.” అంటూ డాక్టర్ నాగేశ్వరరెడ్డికి వైఎస్ జగన్ అభినందనలు తెలియజేశారు.
మరో ట్వీట్ లో “ఆయా రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించి, భారతదేశ అత్యున్నత పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి శుభాకాంక్షలు. డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి (వైద్యం), నందమూరి బాలకృష్ణ (కళలు), మంద కృష్ణ మాదిగ (ప్రజా వ్యవహారాలు), మాడుగుల నాగఫణి శర్మ (కళలు), కేఎల్ కృష్ణ (విద్యా, సాహిత్యం), మిరియాల అప్పారావు (కళలు), వాదిరాజు రాఘవేంద్రాచారి పంచముఖి (విద్య, సాహిత్యం)లకు అభినందనలు” అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. బాలకృష్ణకు జగన్ అభినందనలు తెలియజేసిన నేపథ్యంలో.. టీడీపీ శ్రేణులు జగన్‌కు చెందిన ఓ పాత ఫోటోను వైరల్ చేస్తున్నాయి.
2000 సంవత్సరంలో న్యూ ఇయర్ విషెస్ చెప్తూ వైఎస్ జగన్, బాలకృష్ణ ఫోటోతో ఉన్న యాడ్ ఇచ్చినట్లుగా ఓ పేపర్ యాడ్ వైరల్ చేస్తున్నాయి. మా బాలయ్య బాబు సమరసింహారెడ్డి.. 2000 నూతన సంవత్సర శుభాకాంక్షలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘం ప్రెసిడెంట్ అంటూ జగన్ ఫోటో అందులో ఉంది. ఈ పేపర్ యాడ్‌ను టీడీపీ శ్రేణులు వైరల్ చేస్తున్నారు.
ఆయా రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించి, భారతదేశ అత్యున్నత పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి శుభాకాంక్షలు.
డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి (వైద్యం)
నందమూరి బాలకృష్ణ (కళలు)
మంద కృష్ణ మాదిగ (ప్రజా వ్యవహారాలు)
మాడుగుల నాగఫణి శర్మ (కళలు)
కేఎల్ కృష్ణ (విద్య, సాహిత్యం)…— YS Jagan Mohan Reddy (@ysjagan) January 26, 2025
https://x.com/SAgamanam/status/1883442114257908082?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1883442114257908082%7Ctwgr%5Ed89d00bb1ad777602711f36ae885f885de912dc0%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Fandhra-pradesh%2Fnews%2Fysrcp-chief-ys-jagan-congratulates-nandamuri-balakrishna-and-other-padma-award-winners%2Farticleshow%2F117577285.cms