మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు(Raghavendra Rao) కాంబినేషన్ లో వచ్చిన సోషియో ఫాంటసీ మూవీ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి'(Jagadeka Veerudu Athiloka Sundari). స్వర్గం నుంచి భూమి మీదకి వచ్చిన దేవకన్య పాత్రలో శ్రీదేవి (Sridevi) నటించింది. 1990లో వచ్చిన ఈ సినిమా అప్పటిలో ఒక సంచలనం సృష్టించింది. ఇక ఈ మూవీలో చిరంజీవి, శ్రీదేవి పాత్రలతో పాటు కొందరు పిల్లలు కూడా దాదాపు సినిమా మొత్తం కనిపిస్తుంటారు. అయితే వారిలో ముగ్గురు పిల్లలు హీరోహీరోయిన్లుగా తెర పై కనిపించారని మీకు తెలుసా..?
రిచర్డ్ రిషి (Richard Rishi), షాలిని (Shalini), షామిలి (Shamlee).. ఈ ముగ్గురు నిజ జీవితంలో కజిన్స్. రిచర్డ్ రిషి ‘ఏ ఫిలిం బై అరవింద్’ సినిమాలో హీరోగా నటించాడు. ప్రస్తుతం తెలుగు, తమిళంలో అనేక సినిమాల్లో ముఖ్య పాత్రలు చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తున్నాడు. ఇక షాలిని.. మణిరత్నం ‘సఖి’ సినిమాతో అందరి మనసు దోచుకుంది. 2001 వరకు నటిస్తూ వచ్చిన షాలిని.. తమిళ్ హీరో అజిత్ (Ajith) ని ప్రేమించి పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి యాక్టింగ్ కి గుడ్ బై చెప్పేసింది. ఇప్పుడు వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
ఇక చివరిగా షామిలి విషయానికి వస్తే.. సిద్దార్థ్ నటించిన ‘ఓయ్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తరువాత తమిళ్, మలయాళంలో ఒక్కో సినిమా చేసింది. చివరిగా తెలుగులో నాగశౌర్య ‘అమ్మమ్మ గారి ఇల్లు’ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. మళ్ళీ ఇప్పటి వరకు మరో మూవీలో ఈ భామ కనిపించలేదు. ఇలా ఆ ముగ్గురు పిల్లలు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోహీరోయిన్ల వరకు చేరుకొని ఆడియన్స్ ముందుకు వచ్చారు. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో షామిలి.. అందరి కంటే చిన్న పిల్ల పాత్రలో కనిపించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. వీరు ముగ్గురు ఆ ఒక్క సినిమానే కాకుండా తెలుగు, తమిళ్ లో అనేక సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించారు.
Also Read : Tiragabadara Saami Teaser : ‘తిరగబడరా సామి’ టీజర్ ఎలా ఉందంటే..