Jacqueline Fernandez: 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ హైకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ , ఈడీ ఛార్జ్‌షీట్‌ను రద్దు చేయాలన్న ఆమె అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ తీర్పుతో ఆమెపై క్రిమినల్ విచారణ కొనసాగడం ఖాయమైంది.
సుకేశ్ చంద్రశేఖర్ మోసాలతో సంబంధం ఉన్న ఈ కేసులో ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తమ వాదనలను న్యాయస్థానంలో బలంగా నిలబెట్టింది. ఇప్పటికే ట్రయల్ కోర్టు ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకుని, నేరం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించిందని ఈడీ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అంతేకాదు, ట్రయల్ కోర్టు ఉత్తర్వులను జాక్వెలిన్ ఇప్పటివరకు సవాలు చేయకపోవడంతో, ఆమె పిటిషన్‌కు అర్హత లేదని వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు, ఆమె పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఇదే కేసులో ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్, రాన్‌బాక్సీ సంస్థకు చెందిన మాజీ ప్రమోటర్ల భార్యల నుంచి మోసపూరితంగా రూ.200 కోట్లను వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం సుకేశ్ జైలులో ఉండగా, అతని భార్య లీనా పౌలోస్‌తో కలిసి హవాలా మార్గాల్లో డబ్బు బదిలీలు, బూటకపు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించారన్నది ఈడీ వాదన. ఈ వ్యవహారానికి సంబంధించి జాక్వెలిన్‌ను కూడా నేరానుబంధితురాలిగా చేర్చిన నేపథ్యంలో విచారణ కొనసాగుతోంది.
Pawan Kalyan : సగటు మనిషిని బెదిరించడం వల్లే వైసీపీకు ఈ పరిస్థితి వచ్చింది : పవన్