Site icon HashtagU Telugu

Jacqueline Fernandez: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. హాట్ హాట్‌గా ఫొటోలు!

Jacqueline Fernandez

Jacqueline Fernandez

Jacqueline Fernandez: ఫ్యాషన్ ప్రపంచంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నటి స్టైల్ ఎప్పుడూ ట్రెండీగా ఉంటుంది. ఆమె తరచుగా తన బోల్డ్ వార్డ్‌రోబ్ ఎంపికలతో వార్తల్లో నిలుస్తుంది. తాజాగా పారిస్ ఫ్యాషన్ వీక్‌లో జరిగిన విక్టోరియా బెక్‌హామ్ షోలో ఆమె వేసుకున్న అద్భుతమైన, బోల్డ్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది.

విక్టోరియా బెక్‌హామ్ షోలో జాక్వెలిన్ లుక్

పారిస్ ఫ్యాషన్ వీక్ వేదికపై బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన గ్లామర్, అందంతో అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా విక్టోరియా బెక్‌హామ్ షోలో ఆమె ధరించిన దుస్తులు, లుక్ హాట్ టాపిక్‌గా మారాయి. ఈ గ్రాండ్ ఈవెంట్ కోసం జాక్వెలిన్ ఫ్లోర్-లెంగ్త్ (నేల వరకు తాకే) నలుపు రంగు పొడవాటి గౌనును ధరించింది. ఈ గౌనులో డీప్ వీ-నెక్ లైన్ నడుము వరకు చాచుకుపోయి ఉండటంతో ఆమె తన ఎద అందాలను హైలైట్ చేస్తూ చూసే ఆడియన్స్‌కు నిద్రలేకుండా చేసింది.

అలాగే నడుము భాగంలో గౌనుకు మెరిసే రత్నం (jewel-like clasp) తో కూడిన ఫ్యాబ్రిక్ క్లాస్ప్‌ను జత చేయడం ఆమె అందానికి మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ క్లాస్ప్ గౌను సొగసును రెట్టింపు చేసింది. ఈ బ్లాక్ కలర్ పొడవాటి డ్రెస్స్‌కు అనుగుణంగా జాక్వెలిన్ సింపుల్ హెయిర్ స్టైల్‌ను ఎంచుకుంది. హెవీ హెయిర్ స్టైల్ కాకుండా హాఫ్ పోనీటైల్ వేసుకుని, చెవులకు పెద్ద హూప్ చెవిపోగులు పెట్టుకుంది. అంతేకాకుండా చేతి వేళ్లకు కూడా కొన్ని ఉంగరాలు ధరించి తన లుక్‌ను పూర్తి చేసింది. మొత్తంగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన బోల్డ్, ఎలిగెంట్ లుక్‌తో పారిస్ ఫ్యాషన్ వీక్‌లో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది.

Also Read: Virat Kohli- Rohit Sharma: ఆస్ట్రేలియా సిరీస్ త‌ర్వాత వ‌న్డేల‌కు రోహిత్‌, కోహ్లీ రిటైర్మెంట్?!

జాక్వెలిన్ సినిమా ప్రాజెక్టులు

వృత్తిపరంగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చివరిగా తరుణ్ మన్సుఖాని కామెడీ థ్రిల్లర్ హౌస్‌ఫుల్ 5లో కనిపించింది. ఈ చిత్రంలో ఆమెతో పాటు అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితీష్ దేశ్‌ముఖ్, సంజయ్ దత్, ఫర్దీన్ ఖాన్, శ్రేయస్ తల్పాడే, నానా పటేకర్, జాకీ ష్రాఫ్, డీనో మోరియా, నర్గిస్ ఫక్రీ వంటి ప్రముఖ తారాగణం నటించారు. జాక్వెలిన్ తదుపరి చిత్రం ‘వెల్‌కమ్ టు ది జంగిల్’లో కనిపించనుంది. ఈ సినిమాలో సునీల్ శెట్టి, అర్షద్ వార్సీ, పరేష్ రావల్, జానీ లీవర్, రాజ్‌పాల్ యాదవ్, తుషార్ కపూర్, శ్రేయస్ తల్పాడే, లారా దత్తా, దిశా పటానీ కూడా నటిస్తున్నారు. అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ క్రిస్మస్‌కు థియేటర్లలో విడుదల కానుంది.

Exit mobile version