బొమ్మరిల్లు, పరుగు వంటి హిట్ చిత్రాలను అందించిన భాస్కర్ (Bommarillu Baskar) దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం జాక్ (Jack )ఈరోజు (ఏప్రిల్ 10) థియేటర్లలో విడుదలైంది. టిల్లుగా గుర్తింపు తెచ్చుకున్న సిద్దు (Siddhu Jonnalagadda) జోనర్ మార్చి మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ట్రైలర్ నుంచే భాస్కర్ మేజిక్ కనిపించకపోవడంతో అంచనాలు తక్కువగా ఉండిపోయాయి. ఈ సినిమా ఓ మాస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రమోట్ అయినప్పటికీ, భాస్కర్‌కు అలాంటి జోనర్ సరిపోదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
Drinking Water : తాగేందుకు మంచినీళ్లు లేవని చెప్పి భర్తను వదిలేసిన భార్య..ఎక్కడంటే !
సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్‌లో పంచుకున్న రివ్యూల ప్రకారం.. కథలో ఎక్కడా కనెక్టివిటీ లేదని, స్క్రీన్‌ప్లే గందరగోళంగా ఉందని చెబుతున్నారు. స్పై కామెడీ యాక్షన్ మూవీగా తెరకెక్కించిన ఈ చిత్రంలో స్పై ఎలిమెంట్స్, టెర్రరిస్ట్ ట్రాక్‌లు సరైన బలంగా లేకపోవడంతో సినిమాకు లాగ్ ఉందనే ఫీల్ కలుగుతోందట. కొన్ని కామెడీ సీన్లు ఫస్ట్ హాఫ్‌లో పనిచేశాయన్న అభిప్రాయం ఉన్నా, సెకండ్ హాఫ్ పూర్తిగా తేడా కొట్టేసిందని అంటున్నారు.
సిద్దు తన స్టైల్ కామెడీతో కొన్ని చోట్ల నవ్వులు పూయించినప్పటికీ, కేవలం వన్ లైనర్ పంచులతో సినిమా సక్సెస్ కాదని నెటిజన్లు చెపుతున్నారు. మ్యూజిక్ నిరుత్సాహపరిచిందని, కొన్ని సీన్లలో గ్రీన్ మ్యాట్ ఎఫెక్ట్ చాలా దారుణంగా అనిపించిందని ట్రెండ్ అవుతున్న ట్వీట్లు చెబుతున్నాయి. ఓవరాల్ గా చూస్తే జాక్ ఏమాత్రం బాగాలేదని ఆడియన్స్ చెపుతున్న మాట.