Site icon HashtagU Telugu

Jabardasth Varsha: స్టేజ్ పై ఇమ్మాన్యుయేల్ కాలర్ పట్టుకున్న వర్ష.. అసలు ఏం జరిగిందంటే?

Mixcollage 20 Feb 2024 08 33 Am 2878

Mixcollage 20 Feb 2024 08 33 Am 2878

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ లేడీ కమెడియన్ వర్ష గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట మోడల్ రంగంలోకి అడుగుపెట్టిన వర్షా ఆ తర్వాత సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆపై జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇకపోతే వర్ష ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ అలాగే పలు పండుగ ఈవెంట్ లో చేస్తూ బాగా పాపులారిటీని సంపాదించుకుంది. అలాగే జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ తో లవ్ ట్రాక్ నడుపుతూ మరింత ఫేమస్ అయ్యింది వర్ష. వీరిద్దరికీ పెళ్లి కూడా చేసిన విషయం తెలిసిందే.

తెలుగు బుల్లితెరపై రేష్మి సుధీర్ తర్వాత ఆ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుంది వర్ష ఇమ్మాన్యుయేల్. కాగా జబర్దస్త్ ఫేమ్ వర్ష మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందంటూ బుల్లితెరపై వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఎక్ట్రా జబర్దస్త్ వచ్చాక ఇమ్మాన్యుయేల్, వర్షకు సంబంధించిన లవ్ ట్రాక్ కాస్తా గట్టిగానే నడిచింది. ఇప్పటికీ వీరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోనే ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఇమాన్యుయేలే వర్షని వదిలేసి మరో పెళ్లి చేసుకున్నాడు. వర్షను వదిలేసి ఇమాన్యుయేల్ వేరే పెళ్లి చేసుకోవడంతో వర్ష బీభత్సం స్రుష్టించింది. తనను వదిలేసి మరో పెళ్లి ఎలా చేసుకుంటావా అంటూ గట్టిగా నిలదీసింది.

అంతేకాకుండా స్టేజ్ పైనే అందరి ముందు కాలర్ పట్టుకొని మరి నిలదీసింది. ఇక ఇమ్మాన్యుయేల్ బదులు కూడా ఆసక్తికరంగా మారింది. అయితే ఇదంతా ఎక్ట్ర్సా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో జరిగింది. స్కిటే అయినా కాస్తా రియాలిటీ వెర్షన్ ను తలపించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మేము ఇలాంటివి చాలా చూశాము. ఇంకా ఎన్నాళ్లు జనాలను పిచ్చి వాళ్ళను చేస్తారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Exit mobile version