Site icon HashtagU Telugu

Jabardasth : రోజాకు మంత్రి పదవి.. తలపట్టుకున్న జబర్దస్త్ టీమ్!

Mla Roja

Mla Roja

నుదుటిపై రాసిపెట్టి ఉంటే ఎవరూ తప్పించలేరు. రోజా విషయంలో అదే జరిగింది. సినిమా నటి కావాలనుకున్నారు.. అయ్యారు. ఎప్పటికైనా అసెంబ్లీలో మైకు పట్టుకుని.. అధ్యక్షా అని అనాలనుకున్నారు.. అన్నారు. ఇక ఒక్కసారైనా మంత్రిగారు అని పిలిపించుకోవాలనుకున్నారు. ఇప్పుడు ఆ అదృష్టమూ వరించింది. దీంతో రోజా ఫుల్ ఖుషీలో ఉన్నారు. కానీ జబర్దస్త్ టీమ్ మాత్రం తలపట్టుకుంది.

రోజాకు మంత్రి పదవి రావడానికి, జబర్దస్త్ టీమ్ తలపట్టుకోవడానికి సంబంధం ఏమిటి? అంటే దానికో లెక్కుంది. జబర్దస్త్ షో అంటే రోజా లేకుండా ఊహించలేం. ఎందుకంటే చమక్కులు, చురకలు, కామెడీ, ప్యారడీ.. ఇలా ఏదైనా సరే.. జడ్జ్ సీటులో కూర్చుని డైలాగులు పేల్చడంలో ఆమెకు ఆమే సాటి. నిజం చెప్పాలంటే జబర్దస్త్ షో కు ఆమె ఓ అసెట్. అలాంటిది ఇప్పుడు మంత్రి పదవి రావడంతో జబర్దస్త్ షో కు ఆమె గుడ్ బై చెప్పారు!

తమ షో కు రోజా గుడ్ బై చెప్పడంతో జబర్దస్త్ టీమ్ అంతా డల్ అయిపోయింది. ఇప్పటికే నాగబాబు జడ్జ్ పదవి నుంచి తప్పుకుని షో కు దూరమయ్యారు. ఇప్పుడు రోజా కూడా తప్పుకుంటే.. ఆ సీటుకే అందం పోతుందని, ఆ డైలాగులు ఇక వినిపించవని తెగ ఫీలవుతున్నారు ఆ టీమ్ మెంబర్లు. పైగా రేటింగుల పరంగా కూడా దీని ఎఫెక్ట్ ఉంటుందని వారు భావిస్తున్నారు. ఇప్పటికే తెలుగునాట ఈ షో బాగా పాపులారిటీని సంపాదించింది. ఇప్పటివరకు దానికి పోటీగా ఎన్ని షో లు వచ్చినా హిట్ కొట్టలేకపోయాయి.

రోజా.. సినిమాలు, టీవీలు షోలకు గుడ్ బై చెప్పేశారు. ఇకపై పూర్తిస్థాయిలో మంత్రిగా తన బాధ్యతలమీదే ఫోకస్ పెడతారు. జగన్ ఇచ్చిన మంత్రి పదవికి న్యాయం చేస్తానన్నారు.