Sreemukhi : శ్రీముఖి పెళ్లి ఈ ఏడాదిలోనే జరగొచ్చు.. ముక్కు అవినాష్ కామెంట్స్..

శ్రీముఖి కూడా ఏడడుగులు వేయడానికి సిద్దమవుతున్నారట. ముక్కు అవినాష్ తాజా ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర కామెంట్స్ చేసారు.

  • Written By:
  • Publish Date - May 12, 2024 / 09:10 PM IST

Sreemukhi : టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి.. పెళ్ళికి సిద్దమవుతున్నారట. ఈ ఏడాది సినిమా పరిశ్రమలో పెళ్లి బాజాలు కొంచెం ఎక్కువగానే మోగుతున్నాయి. ఒకరి తరువాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతూ వస్తున్నారు. ఈక్రమంలోనే శ్రీముఖి కూడా ఏడడుగులు వేయడానికి సిద్దమవుతున్నారట. ఈ పెళ్లి గురించి జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్.. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసారు.

ముక్కు అవినాష్, శ్రీముఖి మంచి స్నేహితులు. వీరిద్దరూ కలిసి పలు షోలు కూడా చేస్తూ వస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య క్లోజ్ ఫ్రెండ్‌షిపే ఉంది. ఇక ఈ క్లోజ్‌నెస్‌తో శ్రీముఖి గురించి తనకి తెలిసిన ఓ గుడ్ న్యూస్ ని అవినాష్ బయట పెట్టారు. శ్రీముఖికి తన ఇంటిలో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారట. ఒకవేళ కుదిరితే ఈ ఇయర్ లోనే పెళ్లి జరిగిపోవచ్చు.. అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసారు. దీంతో శ్రీముఖి కూడా ఏడడుగులు వేసేస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈ గుడ్ న్యూస్ ని శ్రీముఖి ఎప్పుడు చెప్పుతుందో చూడాలి.

కాగా శ్రీముఖికి ప్రస్తుతం 31 ఏళ్ళు. నిజామాబాద్ లో జన్మించిన శ్రీముఖి.. టెలివిజన్ రంగంలోకి అనుకోకుండా ఎంట్రీ ఇచ్చారు. శ్రీముఖి ఫాదర్ ఒక సాధారణ ఎంప్లాయ్, మదర్ ఏమో చిన్న బ్యూటీ పార్లర్ నడుపుతూ ఉంటారు. అయితే ఒక టీవీ షో కోసం.. ఈటీవీ ఛానల్ వారు హౌస్ వైఫ్స్ అండ్ లేడీస్ పై ఆ షోని చిత్రీకరిస్తున్నారు. ఈక్రమంలోనే శ్రీముఖి మదర్ నడుపుతున్న బ్యూటీ పార్లర్ గురించి తెలుసుకున్న.. ఆమెతో ఒక ఎపిసోడ్ చేసేందుకు వెళ్లారు.

ఆ సమయంలోనే శ్రీముఖిని చూసిన ఆ టీవీ షో నిర్వాహుకులు.. తమ కొత్త టీవీ షోకి (అదుర్స్) శ్రీముఖికి ఆఫర్ ఇచ్చారు. మొదటిలో శ్రీముఖి ఫాదర్.. ఆ ఆఫర్ కి అంగీకరించలేదు. కానీ తరువాత శ్రీముఖి మదర్ ఒప్పించడంతో.. యాంకర్ గా శ్రీముఖి జర్నీ స్టార్ట్ అయ్యింది. ఆ తరువాత హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు.