Site icon HashtagU Telugu

Jabardasth Mohan: ఘనంగా జబర్దస్త్ కమెడియన్ మోహన్ పెళ్లి వేడుక.. నెట్టింట ఫోటోస్ వైరల్?

Jabardasth Mohan

Jabardasth Mohan

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ షో గురించి మనందరికీ తెలిసిందే. కొన్ని సంవత్సరాలుగా తెలుగులో ప్రసారమవుతూ ఎంతోమంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చింది జబర్దస్త్ షో. ఇప్పటికే ఎంతోమంది జబర్దస్త్ ద్వారా పాపులారిటీని సంపాదించుకుని సినిమాలలో అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో మోహన్ కూడా ఒకరు. జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేస్తూ భారీగా పాపులారిటీని సంపాదించుకున్నాడు మోహన్.

కాగా మోహన్ ను ఒరిజినల్ గెటప్ లో కంటే లేడీ గెటప్ లోని అభిమానులు ఎక్కువగా గుర్తుపడుతూ ఉంటారు. జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ అందరి స్కిట్లలో చేసి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు మోహన్. ఇదిలా ఉంటే జబర్దస్త్ మోహన్ ఎట్టకేలకు ఒక ఇంటివాడు అయ్యాడు. జబర్దస్త్ మోహన్ వివాహం ఘనంగా జరిగింది. జబర్దస్త్ మోహన్ వివాహ వేడుకకి చాలా మంది కమెడియన్లు హాజరై వధూవరులని ఆశీర్వదించారు. జబర్దస్త్ మోహన్ పెళ్లి వేడుకకి అదిరే అభి, గడ్డం నవీన్, రాకెట్ రాఘవ, అప్పారావు లాంటి కమెడియన్లు హాజరయ్యారు.

మోహన్ పెళ్లి వేడుకకి సంబందించిన ఫోటోలని నవీన్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. జబర్దస్త్ మోహన్ వేదికపై వేసే లేడీ గెటప్పులు భలే గమ్మత్తుగా ఉంటాయి. గెటప్పులు మాత్రమే కాదు.. అచ్చం లేడి లాగే బాడీ లాంగ్వేజ్ కనబరుస్తూ నవ్వించడం మోహన్ శైలి అని చెప్పవచ్చు.
రాకెట్ రాఘవకి భార్యగా మోహన్ చాలా స్కిట్ లలో కనిపించాడు. కాగా జబర్దస్త్ మోహన్ పెళ్లి ఫోటోలు వైరల్ అవ్వడంతో అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలపడంతో పాటు సంతోషంగా జీవించండి అంటూ కామెంట్ చేస్తున్నారు.. చూడ ముచ్చటైన జంట,జంట బాగున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు