Jabardasth Faima : తన లవర్‌ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. నెటిజెన్స్ కామెంట్స్ వైరల్..

జబర్దస్త్ ప్రవీణ్ కాదట, మరో ప్రవీణ్ ని పరిచయం చేస్తూ.. అతడే తన లవర్ అంటున్న జబర్దస్త్ ఫైమా.

  • Written By:
  • Publish Date - May 20, 2024 / 10:20 AM IST

Jabardasth Faima : ‘పటాస్’ కామెడీ షోతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి ఫైమా.. ఆ తరువాత జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోల్లో అలరిస్తూ తెలుగు ఆడియన్స్ లో మంచి ఫేమ్ నే సంపాదించుకున్నారు. కాగా ఈ నటి జబర్దస్త్ లో చేస్తున్న సమయంలో కమెడియన్ ప్రవీణ్‌తో.. ఒక లవ్ ట్రాక్ ని నడిపారు. ఈ లవ్ ట్రాక్ పై ఫైమా అండ్ ప్రవీణ్ కలిసి యూట్యూబ్ వీడియోలు కూడా చేసారు. దీంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారేమో అనుకున్నారు.

అయితే ఫైమా ఇప్పుడు మరో ప్రవీణ్ ని పరిచయం చేసి.. ఇతడే నా లవర్ అంటూ చెప్పుకొచ్చారు. తన ఇన్‌స్టాగ్రామ్ లో ఫైమా వేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. రీసెంట్ గా ఫైమా పుట్టినరోజు జరిగింది. ఈ బర్త్ డేని ప్రవీణ్ నాయక్ అనే వ్యక్తి గ్రాండ్ గా నిర్వహించాడు. ఇక ఆ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను ప్రవీణ్ నాయక్ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. “హ్యాపీ బర్త్ డే మై లవ్. ఈ ఐదేళ్లు ఎలా గడిచిపోయాయో కూడా తెలియదు. నేను ఈ జీవితాంతం నీతో గడపాలి అనుకుంటున్నాను. నిన్ను ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటాను ఫైమా కన్నా” అంటూ రాసుకువచ్చాడు.

అంతేకాదు ప్రపోజల్ రింగ్ కూడా తొడిగాడు. ఇక ఈ పోస్ట్ ని ఫైమా తన ఇన్‌స్టాలో కూడా రీ పోస్ట్ చేసారు. ఈ పోస్టుతో వీరిద్దరూ ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నారని అర్ధమవుతుంది. ఇక ఇది గమనించిన నెటిజెన్స్.. ‘ఐదేళ్లుగా ఇతడితో ప్రేమలో ఉన్నప్పుడు, జబర్దస్త్ ప్రవీణ్ తో ఎందుకు లవ్ ట్రాక్ నడిపావు’ అంటూ క్వశ్చన్లు వేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ పోస్టులు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

అయితే ఫైమాతో తన బంధంతో గురించి జబర్దస్త్ ప్రవీణ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఫైమాకి నిజంగానే ప్రపోజ్ చేసినట్లు, కానీ ఆమె నో చెప్పినట్లు చెప్పుకొచ్చారు. అయితే షో కోసం మాత్రం లవర్స్ గా యాక్ట్ చేసినట్లు చెప్పుకొచ్చారు.