Kiraak RP: నెల్లూరు చేపల పులుసు ధరల విమర్శలపై ఘాటుగా స్పందించిన కిరాక్ ఆర్పి?

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ లో కమెడియన్ గా చేసి తనకంటే ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు కిరాక్ ఆర్పీ. కాగా ఆర్పీ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా గడుపుతూ బిజినెస్ రంగంలో బాగా రాణిస్తున్న విషయం తెలిసిందే. నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసు బిజినెస్ ప్రారంభించి బాగానే సంపాదిస్తున్నాడు ఆర్పీ. అయితే వంటలు బాగా రుచిగా ఉండడంతో కస్టమర్ల సంఖ్య పెరిగిపోయింది. దాంతో ఆర్పీ […]

Published By: HashtagU Telugu Desk
Mixcollage 04 Mar 2024 02 17 Pm 749

Mixcollage 04 Mar 2024 02 17 Pm 749

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ లో కమెడియన్ గా చేసి తనకంటే ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు కిరాక్ ఆర్పీ. కాగా ఆర్పీ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా గడుపుతూ బిజినెస్ రంగంలో బాగా రాణిస్తున్న విషయం తెలిసిందే. నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసు బిజినెస్ ప్రారంభించి బాగానే సంపాదిస్తున్నాడు ఆర్పీ. అయితే వంటలు బాగా రుచిగా ఉండడంతో కస్టమర్ల సంఖ్య పెరిగిపోయింది.

దాంతో ఆర్పీ కొద్ది రోజుల పాటు తన బిజినెస్ ని క్లోజ్ చేసి ఆ తర్వాత మళ్లీ కొత్త కొత్త ఫ్రాంచైజీలు స్టార్ట్ చేసి తన బిజినెస్ ని మరింత పెంచుకుంటూ పోతున్నారు. ఇది ఇలా ఉంటే గత కొద్దిరోజులుగా కొంతమంది ఆర్పీ బిజినెస్ ని చూసి కుళ్ళుకుంటున్న వారు ధరలు ఎక్కువగా ఉన్నాయి. నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసు చాలా కాస్ట్లీ అంటూ సోషల్ మీడియాలో నెగిటివ్ గా ప్రచారాలు చేయడం మొదలు పెట్టారు. తాజాగా ఆ వార్తలపై కిరాక్ ఆర్పీ స్పందించాడు. ఈమెకు ఆర్పీ ఆ విషయంపై స్పందిస్తూ.. ఇది నా బిజినెస్. నా రేట్లు ఇంతే. నేను వండే చేపలకు, మిగతా వాటికి చాలా తేడా ఉంటుంది. కొనగలిగే స్థోమత ఉన్నవాళ్లే తీసుకుంటారు. అలాగనీ తక్కువ రేటు అని చెప్పి ఎలా పడితే అలా ఇవ్వలేను కదా.

మేం మొత్తం క్వాలిటీ ప్రొడక్ట్స్ మాత్రమే వాడుతాం. నా చేపల పులుసు మీకు అందుబాటు రేటులో ఉంటేనే తినండి. లేకపోతే వద్దు. కొందరు కావాలనే నా బిజినెస్ పై అలాంటి ప్రచారం చేస్తున్నారు. రూ.100 జేబులో పెట్టుకుని రూ.1000 ఫుడ్ కావాలంటే వస్తుందా? మా చేపల పులుసు తినమని నేను ఎవరినీ బతిమాలాడను కదా? రేట్లు ఎంత పెట్టాలి అనే విషయం నాకు తెలుసు. నేను కూడా రైతు కుటుంబం నుంచే వచ్చాను. ఎవరెన్నీ చేసినా నేను పట్టించుకోను అంటూ తనదైన శైలిలో స్ట్రాంగ్ గా సమాధానమిచ్చారు కిర్రాక్ ఆర్పీ.

  Last Updated: 04 Mar 2024, 02:23 PM IST