Site icon HashtagU Telugu

Chalaki Chanti: జబర్దస్త్ చంటికి అసలు ఏమయ్యింది.. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో తెలుసా?

Chalaki Chanti

Chalaki Chanti

తెలుగు ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ లో తనదైన శైలిలో కామెడీ చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి కమెడియన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు చంటి. గత ఏడాది ముగిసిన బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్న విషయం తెలిసిందే. కానీ బిగ్ బాస్ షో ద్వారా ఇంటికి పెద్దగా ఒరిగింది ఏమీ లేదు అని చెప్పవచ్చు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చంటి శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ షోలో తనదైన శైలిలో కామెడీ చేసిన నవ్వించాడు.

ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో చంటి బుల్లితెరపై అంతగా కనిపించడం లేదు. దీంతో అభిమానులు ఏమయిందా అని ఆరా తీయగా ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. జబర్దస్త్ చంటీకి హార్ట్ ఎటాక్ రావడంతో హాస్పటల్లో చేర్పించారని ప్రస్తుతం చంటి ఐసీఈలో చికిత్స జరుగుతోంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు కలవర పడుతున్నారు. ఇలా ఉంటే తాజాగా అందులో సమాచారం ప్రకారం చంటి కండిషన్ మెరుగైనట్టుగా తెలుస్తోంది.

అయితే అభిమానులు చంటి కనిపించకపోవడంతో ఏదైనా సినిమాలలో నటిస్తున్నాడేమో అని అనుకున్నారు. అందుకే జబర్దస్త్ లో శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కనిపించడం లేదు అని అనుకున్నారు. కానీ చంటి గుండె సంబంధించిన సమస్యతో హైదరాబాదులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరినట్లు వార్తలు వినిపించడంతో అభిమానులు షాక్ అయ్యారు. ప్రస్తుతం చంటి పరిస్థితి బాగానే ఉన్నట్టు తెలుస్తోంది. హాస్పిటల్ లో చేర్చినప్పుడు కండిషన్ చాలా సీరియస్ గా ఉన్నప్పటికీ ప్రస్తుతం కోలుకున్నట్లు తెలుస్తోంది. రేపు లేదా ఎల్లుండి చంటిని డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తోంది.