తెలుగు సినీ ప్రేక్షకులకు జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం రష్మీ శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోలతో పాటు పలు పండుగ ఈవెంట్లకు కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉంది రష్మి. అలాగే అప్పుడప్పుడు సినిమాలలో నటిస్తూ మెప్పిస్తోంది. సినిమాలు అనుకున్న విధంగా రష్మికి కలిసి రాకపోవడంతో బుల్లితెరకే పరిమితం అయ్యింది. ప్రస్తుతం ఒకవైపు బుల్లితెరపై షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటో షూట్స్ తో యువతకు అందాల కనువిందు చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
We’re now on WhatsApp. Click to Join
అప్పుడప్పుడు నెటిజన్స్ కీ కూడా కౌంటర్ ఇస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా జబర్దస్త్ లేడి కమెడియన్ రష్మి ని స్టేజ్ పైకి పిలిచి మరీ అవమానించిది. అసలేం జరిగిందంటే.. తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో విడుదలైంది. ఆ ప్రోమోలో ఆది స్కిట్‌తో అలరించాడు ఇమ్మాన్యుయెల్. అలాగే భాస్కర్ కూడా తనదైన స్టయిల్‌లో రచ్చ చేశాడు. ఈ క్రమంలో జబర్దస్త్ లేడీ కమెడియన్ రోహిణి తెలుగు టీచర్ స్కిట్‌ని ప్రదర్శించింది. ఇందులో టెంన్త్ క్లాస్‌లో వచ్చే ప్రవరుని స్వాగతంకి సంబంధించిన ఒక పద్యాన్ని చదివి వినిపించింది రోహిణి. చాలా క్లిష్టమైన ఆ పద్యం చదవడానికి నోరు తిరగడమంటే చాలా కష్టం.
Also Read: Kadambari Kiran: మరొకసారి గొప్ప మనసును చాటుకున్న కాదంబరి కిరణ్.. వరుస సహాయలతో బిజీ?
కానీ రోహిణి మాత్రం ఈజీగా చదివేసింది. ఊపిరితీసుకోకుండా, గుక్కతిప్పకుండా ప్రారంభం నుంచి చివరి వరకు చెప్పి వాహ్ అనిపించింది. అయితే ఆ పద్యం చదవడానికి ముందు యాంకర్ రష్మిని స్టేజ్‌పైకి పిలిచింది. ఆమె సమక్షంలోనే ఆ పద్యం చదివింది. రోహిణి అంత అనర్గళంగా ఆ పద్యం చెప్పడంతో రష్మికి మైండ్ బ్లాక్ అయ్యింది. దాంతో బిక్క మొహం వేసిన రష్మి ఆమెకి దెండం పెట్టి వెళ్లిపోయింది. కానీ రోహిణి మాత్రం వదల్లేదు. ఆమెని మళ్లీ స్టేజ్‌పైకి పిలిచింది. ఆ పద్యంలోని రెండో వ్యాఖ్యం చదవాలని చెప్పింది. చదివి వినిపించింది. రష్మి కూడా సాహసం చేసింది. చదవలేక చదివి నవ్వులపాలు అయ్యింది. ఆమె పదాలను పలికిన తీరుకి అందరు ఫుల్ గా నవ్వారు. అంతేకాదు ఆ మధ్య ఉల్లాసంగా, ఉత్సాహంగా అనమంటే లంగా, లెహంగా అన్నదని చెప్పి రష్మి పరువు మరోసారి తీసింది రోహిణి. ఆ మాటకు అక్కడ ఉన్న వారందరూ ఇంకా ఎక్కువగా నవ్వుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.
Also Read: Trisha: ఆ విషయంలో నయనతార రికార్డును త్రిష బద్దలు కొట్టిందా.. ఇందులో నిజమెంత?