Site icon HashtagU Telugu

Jabardasth pavithraa: ఎంగేజ్మెంట్ జరిగిన కొద్ది రోజులకే ప్రియుడికి బ్రేకప్ చెప్పేసిన జబర్దస్త్ లేడీ కమెడియన్.. పోస్ట్ వైరల్?

Mixcollage 15 Feb 2024 08 16 Am 6883

Mixcollage 15 Feb 2024 08 16 Am 6883

తెలుగులో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఇప్పటికే ఎంతోమంది ఆర్టిస్టులు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన విషయం మనందరికీ తెలిసిందే. అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ జబర్దస్త్ షో కి కొత్త కొత్త ఆర్టిస్టులు ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. అలా ఇటీవల కాలంలో జబర్దస్త్ షోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో లేడీ కమెడియన్ పవిత్ర కూడా ఒకరు. ఈమె జబర్దస్త్ షో ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒకవైపు జబర్దస్త్ షో అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో చేస్తూనే సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తూ బాగానే సంపాదిస్తోంది.

ఇది ఇలా ఉంటే ఇటీవల పవిత్ర తనకు కాబోయే భర్తను పరిచయం చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈమె గత ఏడాది నవంబర్ లో తన ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. అదే విషయాన్నీ అభిమానులతో పంచుకుంటూ అందుకు సంబందించిన ఫోటోలను, వీడియోలను కూడా షేర్ చేసింది. సంతోష్ అనే వ్యక్తితో సంవత్సరం పాటు ప్రేమాయణం నడిపిన పవిత్ర నవంబర్ లో పెళ్ళికి ఓకే చెప్పి నిశ్చితార్థం జరుపుకుంది. ఇక ఆ తరువాత నుంచి ఇద్దరు కలిసి డాన్స్ లు చేస్తూ సోషల్ మీడియాలో తెగ సందడి చేశారు. అయితే త్వరలో పెళ్లి వార్త చెబుతారని అందురు అనుకుంటే, ఇప్పుడు సడన్ గా విడిపోతున్న వార్త చెప్పారు.

 

ఇద్దరు ఒకటిగా నిర్ణయించుకున్న తరువాతే విడిపోతున్నట్లు పవిత్ర తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక చేసింది. తమ నిర్ణయాన్ని అర్డంచేసుకొని, ఈ కష్ట సమయంలో తమకి సపోర్ట్ గా ఉండాలని కోరింది పవిత్ర. కాగా ఈ పోస్ట్ కి కామెంట్స్ ఆప్షన్ ని పవిత్ర ఆఫ్ చేయడం గమనార్హం. అంతేకాదు, తన ఇన్‌స్టాలో సంతోష్ కి సంబంధించిన ఫోటోలను, వీడియోలను కూడా డిలీట్ చేసేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. వీరిద్దరూ నిజంగానే విడిపోతున్నారా లేదా అనే ప్రశ్నగా మారింది. ఎందుకంటే, గతంలో వీరిద్దరూ పెళ్లి విషయంలో కూడా ఒక ప్రాంక్ వీడియో చేశారు. దీంతో ఇప్పుడు ఈ పోస్ట్ కూడా అలా ప్రాంక్ విషయంలోనే చేసి ఉంటారని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.