Site icon HashtagU Telugu

Ivana : దళపతి సినిమా ఆఫర్ కాదన్న ఇవానా.. లవ్ టుడే హీరోయిన్ ఎందుకిలా చేసింది..?

Ivana Reject Thalapathy Vijay Goat Offer

Ivana Reject Thalapathy Vijay Goat Offer

Ivana కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు డైరెక్షన్ లో చేస్తున్న సినిమా G.O.A.T. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినా కూడా లవ్ టుడే హీరోయిన్ కాదనేసిందని తెలుస్తుంది. లవ్ టుడేతో సూపర్ పాపులర్ అయిన ఇవానా విజయ్ గోట్ (G.O.A.T) ఆఫర్ ని వద్దనుకుందట.

అయితే సినిమాలో ఆమెకు సిస్టర్ రోల్ ఇచ్చారట. విజయ్ కి సోదరిగా నటించే ఛాన్స్ ఇవ్వగా స్టార్ సినిమాల్లో సిస్టర్ గా చేస్తే ఇక మీదట అన్నీ అలాంటి అవకాశాలే వస్తాయని ఆమె వద్దనుకుందట. దళపతి విజయ్ సినిమాలో ఛాన్స్ వదులుకోవడం బాధగానే ఉన్నా సినిమాలో ఇలా సిస్టర్ రోల్ కాకుండా మరేదైనా వస్తే చేసేదాన్ని అంటూ ఇవానా చెప్పుకొచ్చింది.

లవ్ టుడే సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసులు కూడా దోచేసిన ఇవానా ప్రస్తుతం తెలుగులో ఆశిష్ రెడ్డి హీరోగా చేస్తున్న ఆశిష్ రెడ్డి సెల్ఫిష్ లో చేస్తుంది. తెలుగులో ఇవానాకు సెల్ఫిష్ మంచి అవకాశమని చెప్పొచ్చు.

Also Read : Kalki 2898 AD : కల్కి 2898 ఏడి రిలీజ్ వాయిదా.. కొత్త డేట్ ఎప్పుడు..?